నేడు జరగబోయే సిపిఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
బద్వేలు ముచ్చట్లు:
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కడప జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఏఐటీయూసీ బద్వేలు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఇర్ల నాగేష్ నాగ దాసరి ఇమ్మానుయేలు అన్ని రంగాల కార్మికులకు పిలు నిచ్చారు ఈసందర్భంగా కార్మికులతో వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సిపిఐ పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు పేద ప్రజలకు ఎన్నో రకాలుగా అలుపెరగని పోరాటాలు మరియు ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ తప్పా ఇంకోటి లేదని వారికి తెలిపారు రేపు జరగబోయే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని బహిరంగ సభ ర్యాలీలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కి కమ్యూనిస్టు పార్టీ యొక్క సత్తాను తెలియజేయాలని వారు తెలిపారు మున్సిపాలిటీ అమాలి ఆశ మధ్యాహ్న భోజనం ఆటో వీధి విక్రయదారులు అనుబంధ సంఘాల కార్మికులను కలిసి తెలియజేశారు
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు బ్రహ్మయ్య భాష రవీంద్ర మస్తాన్ ఫిరోద్ తదితర కార్మికులు పాల్గొన్నారు.

Tags: Celebrate the CPI District Mahasabhas to be held today
