వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 23న జరిగే రాష్ట్రవ్యాప్త విద్యా సంస్థల బందును జయప్రదం చేయండి

-AISF చిత్తూరు జిల్లా కోకన్వీనర్ మున్నా పిలుపు

 

పుంగనూరు ముచ్చట్లు:

ఆగస్టు 23న జరిగే రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్య రంగాన్ని పరిరక్షిస్తామని విద్య అత్యంత ప్రాధాన్యత ఇస్తానని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని వి స్మరించారనారు. , రాష్ట్రంలో సుమారు పదివేల పాఠశాలలు మూతపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొందని, అదేవిధంగా పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు జీవో నెంబర్ 77ను తీసుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ తీసేయడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు పిజి కోర్సులు చేయలేక డిగ్రీ చదివి కూలీ పనులు చేసుకునే దుస్థితి జగన్ ప్రభుత్వం కల్పిస్తుందని,  యూనివర్సిటీలలో స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా కామన్ పీజీ సెట్ పెట్టి యూనివర్సిటీలో స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని వారన్నారు , రాష్ట్రంలో నెలకొన్న విద్యార్థులకు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23 తేదీన జరుగుతున్న బంద్ కు విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థ యాజమాన్యాలు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ బంద్ ను జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో లీల తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Celebrate the statewide bandh of educational institutions on 23rd under the auspices of the Left Student Unions

Leave A Reply

Your email address will not be published.