Celebrate Valmiki's birthday

వాల్మీకి జయంతిని జయప్రదం చేయండి

Date:28/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఈనెల 31న నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అద్దాల నాగరాజ కోరారు. బుధవారం ఈ మేరకు వాల్మీకి సంఘ నాయకులతో కలసి కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగరాజా మాట్లాడుతూ పట్టణంలోని ఇందిరాసర్కిల్‌లో వాల్మీకి జయంతి వేడుకలను ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని తెలిపారు. జయంతి వేడుకల్లో వాల్మీకులు తప్పక పాల్గొని, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ సందర్భంగా ర్యాలీతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగరాజు, జి.వెంకట్రమణ, వి. వెంకట్రమణ,రెడ్డెప్ప, ఎం.వెంకట్రమణపాల్గొన్నారు.

కాంగ్రెస్ నేతపై దాడికి యత్నం

Tags: Celebrate Valmiki’s birthday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *