Natyam ad

15వ తేది నుండి 28 వరకు అబ్దుల్ కలాం జయంతి ఉత్సవాలను జరపడం శుభ పరిణామం

-అబ్దుల్ కలాం జయంతి ఉత్సవ ప్రారంభ సభలో కే.ఎల్.వర్మ పిలుపు.

 

తిరుపతి ముచ్చట్లు:


మాజీ రాష్ట్రపతి డా” ఏ పి జే అబ్దుల్ కలాం 91వ జయంతి పురస్కరించుకొని తిరుపతి నగరంలో అబ్దుల్ కలాం జయంతి ఉత్సవాలను నిర్వహించడం శుభ పరిణామమని తిరుపతి నగర పాలక సంస్థ రెవిన్యూ అధికారి కే.ఎల్. వర్మ పేర్కొన్నారు. శనివారం ఉదయం తిరుపతి జీవకోన విశ్వం టాలెంట్ స్కూల్ నందు సంకల్ప సేవా సమితి వ్యవస్తాపక అధ్యక్షులు ఎన్. రాజరెడ్డి అధ్యక్షతన అబ్దుల్ కలాం జయంతి ఉత్సవాల ప్రారంభ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మొదటగా డా. ఏ పీ జే అబ్దుల్ కలామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కే.ఎల్.వర్మ మాట్లాడుతూ డా అబ్దుల్ కలాం ఆశయాలకు అనుగుణంగా నేటి తరం విద్యార్థులు నడుచుకుంటూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని జీవిత లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. పేదరికంలో పుట్టి పట్టుదల కృషితో తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారని అన్నారు. అబ్దుల్ కలాం ఆశయాలను నేటి తరం విద్యార్థులు కొనసాగించాలని ఆశించారు.

 

 

 

Post Midle

విశ్వం విద్యాసంస్థల అధినేత ఎన్. విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఈ యుగానికే యుగ పురుషడని, ఆయన జీవితం ఎందరికో ఆదర్శవంతమని అన్నారు. నేటి విద్యార్థులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలనారు.శంకరంబాడి సాహిత్యం పీఠం అధ్యక్షురాలు డా డి. మస్తానమ్మ మాట్లాడుతూ కఠిక పేదరికం నుండి రాష్ట్రపతి స్థాయి వరకు తన స్వయంకృషితో ఎదిగారని, రామేశ్వరం అనే ఒక చిన్న పల్లెటూల్లో ఒక పేద కుటుంబంలో జన్మించి చిన్నప్పుడే ఎగురుతున్న పక్షులను చూసి మనిషి కూడా ఎందుకు ఎగరలేదని తలంచి ఒక దేశం గర్వించదగ్గ పునాది వేసిందన్నారు.

 

 

 

సంకల్ప సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్. రాజారెడ్డి మాట్లాడుతూ విద్యార్ధి, యువకులకు అబ్దుల్ కలాం ఆదర్శ్యాలను తెలియజేసేందుకు సంకల్ప సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ నెల 17న వక్రుత్వ పోటీలు విశ్వం స్కూల్ జీవకొనలో, చిత్రాలేఖన పోటీలు ఈ నెల 19న ఎస్. వి. యు క్యాంపస్ స్కూల్ నందు, వ్యాసరచన పోటీలు ఈ నెల 21న శ్రీ పద్మావతి ఉన్నత పాఠశాల నందు నిర్వహించి ఈ పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులకు ఈ నెల 28న మహతి ఆడిటోరియంలో జరిగే ఉత్త విద్యార్ధి అభినందన సభలో ప్రధానం చేయడం జరుగుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన విద్యార్థులు 9550227479 షేక్ ముహమ్మద్ రఫీ, 9951371706 పెదరాయుడు లను సంప్రదించగలరని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో రఫీ హిందూస్తాని, షేక్ ముహమ్మద్ రఫీ, పెదరాయుడు, విశ్వం విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: Celebrating Abdul Kalam Jayanti from 15th to 28th is an auspicious development.

Post Midle

Leave A Reply

Your email address will not be published.