Date:15/12/2019
పుంగనూరు ముచ్చట్లు:
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పట్టణంలోని దూళ్లవాండ్ల ఇండ్లలో ఆదివారం ఘనంగా సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని దూళ్లవాళ్లఇండ్లలోని చర్చిలో పాస్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా వైఎస్సార్ ఆర్టీసి మజ్ధూర్ అధ్యక్షుడు జయరామిరెడ్డి, వ్యాపారవేత్త ఎస్‌డిఎస్ సంపత్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా 200 మందికి ప్రేమ విందు ఇచ్చారు. పాస్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి క్రైస్తవ పాస్టర్లకు రూ.5 వేలు వేతనం ఇవ్వడం శుభపరిణామమన్నారు. క్రీస్తు పుట్టిన స్థలానికి రూ.60 వేలు ఉచితంగా ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర పంచాయతీశాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్రైస్తవ మందిరాలకు సీసీరోడ్లు , నీటి కొళాయిలు , క్రైస్తవ సమాధులతోటలకు రోడ్లు వేయడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్, మాజీ కోఆప్షన్ సభ్యురాలు పద్మావతమ్మ , సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags: Celebrating Christmas