Celebrating Engineersday richly

ఘనంగా ఇంజనీర్స్ డే సంబరాలు

Date:15/09/2020

పుంగనూరు ముచ్చట్లు:

డాక్టర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే ను కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ కెఎల్‌.వర్మ మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఇంజనీర్లు ఆదర్శంగా తీసుకోవాలని , అత్యంత మేదోశక్తి కలిగిన ఇంజనీర్లు భావితరాలకు మార్గదర్శకంగా ఉండేలా వినూత్న పద్దతిలో నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మాజీ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర, టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ కృష్ణారావు, అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌, ఏఈ కృష్ణకుమార్‌ , టౌన్‌ప్లానింగ్‌ సర్వేయర్లు చంద్రశేఖర్‌రెడ్డి, సంపత్‌కుమార్‌, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

రేప్‌కు పాల్ప‌డిన‌వారి వృష‌ణాలు ప‌నిచేయకుండా చేయాలి

Tags: Celebrating Engineersday richly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *