Natyam ad

ప్రజా సంకల్ప యాత్రకు ఐదేళ్లు సంబరాలు

రామసముద్రం ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కు ఐదేళ్లు పూర్తి కావడంతో రామసముద్రం లో వైఎస్సార్ సీపీ నాయకులు సంబరాలు చేశారు. స్థానిక ఎంపిడివో కార్యాలయ అవరణంలో పెద్ద కేకును కట్ చేసి అందరికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగనన్న ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారంలోకి రాగానే అప్పుడు ఇచ్చిన హామీలను దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 90శాతం అమలు చేయడం జరిగిందన్నారు. అలాంటి ప్రజాసేవకుడుని ప్రతి ఒక్కరు ఆదరించి వచ్చే ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రి ని చేసేందుకు ప్రజలు ముందుడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ భాస్కర్ గౌడు, ఎంపీపీ కుసుమకుమారి, వైస్ ఎంపీపీ రమణారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు కేశవరెడ్డి, మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నాయకులు ప్రకాష్, రాధా, గెవన్న, నంద, తిప్పారాజు, రెడ్డెప్పనాయుడు, సిరాజ్ బాషా, కృష్ణప్ప, మహబూబ్ బాషా, సుబ్బన్న, శివ, శేషు, ఆనంద తదితరులు పాల్గొన్నారు.

 

 

Post Midle

Tags: Celebrating five years of Praja Sankalpa Yatra

Post Midle

Leave A Reply

Your email address will not be published.