Natyam ad

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు      

మంథని ముచ్చట్లు:


భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు మంథనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం మంథని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  మంథని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు  సెగ్గం రాజేష్, పట్టణ అధ్యక్షుడు పోలు శివ ఆధ్వర్యంలో భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాని, ఉక్కు మహిళ  ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ ఒడ్నాల శ్రీనివాస్, బీసీ సెల్ మంథని నియోజకవర్గ అధ్యక్షులు గోటికార్ కిషన్ జీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జంజర్ల శేఖర్, అజీమ్ ఖాన్, మాజీ సర్పంచ్ దోరగొర్ల శ్రీనివాస్ యాదవ్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్, గోపాల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు చంద్రు రాయమల్లు, కాంగ్రెస్ నాయకులు ఎల్లంకి వంశీ, ముస్కుల సురేందర్ రెడ్డి, పరసవెన మోహన్ యాదవ్, ఉరవకొండ గణేష్, నరెడ్ల కిరణ్, గుండ రాజు, ఐసన్, ఆగ రమేష్, తాళ్లపల్లి సత్తన్న గౌడ్, ఎస్ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

 

Tags; Celebrating Indira Gandhi’s birth anniversary

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.