రామసముద్రం లోసంక్రాంతి సంబరాలు

Celebrating Lunar Revolution in Ramasamudram

Celebrating Lunar Revolution in Ramasamudram

Date:13/01/2020

రామసముద్రం ముచ్చట్లు:

 

సంక్రాంతి పండుగ సంబరాలను సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముగ్గులపోటీలు,సంక్రాంతి వ్యాస రచన పోటీలు నిర్వహించారు. చెక్క భజన,కోలాటాలు,పండరి భజన,పిల్లనగోవి సంగీత ,మహిళలతో గొబ్బెమ్మ పాటలతో సంబరాలు జరుపుకున్నారు .వెలుగు,ఐ సి డి ఎస్,ఉపాధి హామీ,పంచాయతీ కార్యాలయం సిబ్బంది ఈ సంసృతిక క్రీడలలో పాల్గొన్నారు.అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన పండ్లు,పిండి వంటలు ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ముగ్గులపోటీలు, వ్యాస రచన,మ్యూజికల్ చైర్ పోటీలలో గెలుపొందిన వారికి ఎం పి డి ఓ లక్ష్మి పతి,మండల వై సి పి నాయకులు బాస్కర్ రెడ్డి, కేశవరెడ్డి, లు బహుమతులు అందచేశారు.ఈ కార్యక్రమంలో హోసింగ్ ఏ ఈ మినీశ్వర నాయుడు, ఉపాధి ఎపిఓ గౌరీ శంకర్ విద్యుత్ శాఖా అధికారి సురేందర్ నాయక్.వెలుగు ఏ పి ఎం నీరజ ,పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

17 లోపు ఓటర్ల కులగణన పూర్తి చేయాలి

Tags: Celebrating Lunar Revolution in Ramasamudram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *