భక్తి శ్రద్ధలతో మిలాదున్ నబీ సంబరాలు

Date:30/10/2020

కౌతాళం  ముచ్చట్లు:

మండల కేంద్రం లో మదిన మసీదు లో  మిలాదున్ నబీ సంబరాలు చాల ఘనంగా ముస్లిం సోదరులు జరుపుకున్నారు.మహమ్మద్ ప్రవక్త సోల్లెలహు అలైహి వ మొహమ్మద్ రసులిల్లాహు జన్మదిన సందర్భంగా శుక్రవారం గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. మదిన మసీదులో ముస్లిం సోదరులు  జెండా కు పూలమాలలు వేసి ప్రత్యేక ఫతేహాలు, మరియు ప్రార్థన లు చేసి పురా విధుల్లో భారీగా జెండా ను ఊరేగింపు గా తీసుకెళ్లారు. గ్రామ ప్రజలు చూసి దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. మసీదు నుంచి బిస్మిల్ సర్కిల్ మీదుగా పాత బస్టాండ్, బుడ్డప్ప సర్కిల్ మీదుగా మసీదుకు చేరుకున్నారు. అనంతరం జెండా ను మసీదులో ప్రత్యేక ఫతేహాలు చేసి గుమ్మం పైన ఎగురవేశారు. మసీదులో దేవుని ప్రసాదం కు ప్రత్యేక ఫతేహాలు అనంతరం ముస్లిం సోదరులకు అందించారు.ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ భక్తి భావంతో ఉండాలని,5 పుటలు నమాజులు చేయాలని, బీద వారిపై చిన్న చూపు చూడకూడదని,కరోన నుంచి దూరంగా ఉండాలని అందరిని చల్లగా చూడాలని దేవుని  ఉషేన్ వలి ముత్తాలి, కోరారు. మసీదులో నే ముస్లిం సోదరులకు భోజన వసతులు కల్పించారు.ఈ కార్యక్రమంలో మొహమ్మద్ ముత్తాలి, ఉషేన్ రాజహమద్,బాష, మాత పెద్దలు భారీగా ముస్లిం సోదరులు తరలివచ్చారు.

వీధి వ్యాపారులకు గొడుగుల పంపిణీ

Tags: Celebrating Miladun Nabi with devotional zeal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *