ఘనంగా చేనేత కార్మిక యూనియన్ 31వ వార్షికోత్సవ వేడుక.

తిరుపతి ముచ్చట్లు:
 
తిరుపతి లోని యూత్ హాస్టల్ నందు చేనేత కార్మిక యూనియన్ 31వ వార్షికోత్సవ వేడుకలను జిల్లా అధ్యక్షులు ఆకుల వాసు ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ప్రధాన కార్యదర్శి, పెనుమూరు మాజీ ఎంపీపీ షణ్ముగవర్మ యూనియన్ నివేదికను తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్,అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఆర్ డి డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ హాజరయ్యారు.విశిష్ట అతిథులుగా మాజీ ఆప్ కో డైరెక్టర్ మిద్దెల హరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా చేనేత సదస్సును నిర్వహించారు.చేనేత అభివృద్ధి-అవకాశాలు, అవరోధాలు
అనే అంశంపై చర్చ వేదిక కార్యక్రమం చేపట్టారు.చేనేత చట్టాలు వాటి పనితీరు,చేనేత రంగం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు గురించి,
చేనేత పై సున్నా జిఎస్టి, చిలప నూలు పై పన్ను ,ఋణాల గురించి,చర్చ జరిపారు.అంతే గాక చేనేత సహకార సంఘాలు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి,చేనేత రంగం లో మాస్టర్ వీవర్ వ్యవస్థ గురించి,చేనేత రంగంలో మహిళల సమస్యలు,సంక్షేమ పథకాలు గురించి,చేనేత లో అనుబంధ వృత్తుల వారి సంక్షేమం గురించి, చేనేత పరిశోధన సంస్థలు చేయాల్సిన అభివృద్ధి గురించి పలు సూచనలు, సలహాలు అందించారు.అర్హులు ఐన ప్రతి ఒకరికి తమ వంతు బాధ్యత గా ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందిచటానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.మాజీ అప్కో డైరెక్టర్ మిద్దెల హరి తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి,నూతనముగా బాధ్యతలు చేపట్టిన
జి.వెంకట రామ్సహాయ సంచాలకులు చేనేత మరియు జౌళి శాఖ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
విశ్రాంత చేనేత అభివృద్ధి అధికారి డాక్టర్ ధర్మయ్య ఉత్తేజ పరచే గీతాలను,కవితలను వినిపించారు. విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు శంభోలో తో రామిరెడ్డిలు చేసిన, మిమిక్రి,ఇంద్రజాలం సభికులను ఆకట్టుకుంది.
తొగట వీర క్షత్రియ సురేష్,పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కే సురేంద్ర నాధ్,దేవాంగ రాష్ట్ర కార్యదర్శి పృద్వి రవి,చేనేత సమన్వయ కమిటీ రాష్ట్ర సభ్యులు గుత్తి త్యాగరాజు,చేనేత జిల్లా నాయకుడు ముస్టూరు రాంమోహన్ తమ విలువైన సందేశాన్ని అందించారు.ఈ సందర్భంగా చేనేత కార్మిక యూనియన్ 2022 క్యాలెండరు ను ఆవిష్కరించారు.చేనేత సహకార సంఘాల అధ్యక్షులు,చేనేత వర్గానికి చెందిన కుల సంఘాల పెద్దలు,జిల్లా ప్రముఖులు, ఇతర జిల్లాలచేనేత ప్రతినిధులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు కే వి కుప్పయ్య, సాంబశివయ్య,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జె వి రమణ, ఉపాధ్యక్షులు కందుల బాలాజీ, పిచ్చిక కృష్ణయ్య,బండారు హరి రాం తో పాటు కార్యవర్గ సభ్యులు,చేనేత అభిమానులు, జిల్లా నలుమూలల నుండి చేనేత మండల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Celebrating the 31st Anniversary of the Great Handloom Workers Union.

Natyam ad