పెద్దపంజాణి లో ఘనంగా 72వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

Celebrating the 72nd Independence Day in the Bigger Jana

Celebrating the 72nd Independence Day in the Bigger Jana

Date:15/08/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

మండల కేంద్రమైన పెద్దపంజాణి లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల్లో 72 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్మారు. మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మురళీకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు సులోచన భారత మాత చిత్ర పటానికి పూజలు నిర్వహించి, జాతీయ జెండాను ఎగురవేశారు.

 

జనగణమన గీతాలాపన చేశారు. అలాగే అప్పినపల్లె, పంజాణి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఎంపీపీ, జెడ్పీటీసీ ముఖ్య అతిథులు గా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

 

అనంతరం జెడ్పీటీసీ సభ్యురాలు సులోచన అప్పినపల్లె పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన క్రీడా పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.

 

 

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంఈవో హేమలత, ఎంపీటీసి మధులత, ఎస్ఎంసీ చైర్మన్ సుబ్రమణ్యం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజప్ప, చంద్రశేఖర్ రెడ్డి, జెబి కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి, వేణుగోపాల్ నాయుడు, మాజీ సర్పంచ్ లు సునీత, రామకృష్ణ, సురేష్, ఉపాద్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఎందరో జాతీయ నాయకుల త్యాగ ఫలం భారత దేశ స్వాతంత్ర్యం

Tags: Celebrating the 72nd Independence Day in the Bigger Jana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *