అంబరాన్ని అంటిన న్యాయవాదుల సంబరాలు

Date: 31/07/2020

కర్నూలు ముచ్చట్లు :

కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్‌గా ప్రకటించినందుకు ఆదోని బార్ అసోసియేషన్ అధ్యక్షులు గిరిధర్, కార్యదర్శి దేవరాజ్ మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు కలను సాకారం చేసినందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కి మరియు రాష్ట్ర మంత్రి వర్గానికి, ఆంధ్రరాష్ట్ర ఎమ్మెల్యేలకు ముఖ్యంగా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాయలసీమలో హైకోర్టు కొరకు ఉద్యమ బాట పట్టిన మొట్టమొదట ఆదోని నుండి ప్రారంభమవడం విజయానికి నాంది గా హర్షం వ్యక్తం చేశారు. అలాగే న్యాయవాదులు అంతా బాణసంచా పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఆదోని న్యాయవాదుల బార్ అసోసియేషన్కు సహకరించిన ఆదోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు, వివిధ ప్రజా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, రాజకీయ పార్టీలకు, మరియు వర్తక, వాణిజ్య, వ్యాపార, కర్షక, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, అందరికీ పేరుపేరునా ఆదోని న్యాయవాదుల బార్ అసోసియేషన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు బషీర్,శివ ప్రసాద్, జీవన్ సింగ్, తాయన్న, నెట్టేకంటయ్య, వీరేష్,వీరభద్ర గౌడ్, రజనీకాంత్, విరుపాక్షి రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, వెంకట స్వామి, హరినాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ప్రధాన కార్యాలయాల హెచ్.ఓ.డి.లకు ఆదేశాలు

Tags: Celebrating the lawyers who pasted the amber

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *