కేటీఆర్‌ నియామకం పట్ల తెరాస శ్రేణుల సంబరాలు

Celebrating the Teresa Ranges for Ketiar appointment

Celebrating the Teresa Ranges for Ketiar appointment

Date:14/12/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్‌ నియామకం పట్ల తెరాస శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. తమ అభిమాన నేతకు అభినందనలు తెలిపేందుకు పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ప్రగతిభవన్‌కు తరలివచ్చారు. పలువురు ఎమ్మెల్యేలు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల సమయంలో కేటీఆర్‌ పడ్డ కష్టాన్ని కేసీఆర్‌ గుర్తించారని జగదీశ్‌రెడ్డి అన్నారు. పార్టీ బలోపేతానికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై కేటీఆర్ కు మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభినందనలు తెలిపారు. కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ మరెన్నో విజయాలు నమోదు చేస్తోందని కాంక్షించారు.అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కేటీఆర్ కు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అభినందనలు తెలిపారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమించినందుకు సీఎం కేసీఆర్ కు సంతోష్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉప ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడంలో కేటీఆర్ కీలకపాత్ర పోషించారని కొనియాడారు. కేటీఆర్ నాయకత్వంలో మున్ముందు మరిన్ని విజయాలు సాధిస్తామని, పార్టీ బలోపేతం అవుతుందని సంతోష్ కుమార్ పేర్కొన్నారు.. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావును పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నియమించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు తు.చ తప్పకుండా అమలుచేయాల్సిన బాధ్యతలు తనపై ఉన్న దృష్ట్యా.. అత్యంత నమ్మకస్తుడు, సమర్థుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావించిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
Tags:Celebrating the Teresa Ranges for Ketiar appointment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *