వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంపై నేతల సంబరాలు

Celebrating YSRCP

Celebrating YSRCP

Date:30/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

 

రాష్ట్రంలో వైఎస్సార్సీపి విజయం సాధించి, ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పదవి స్వీకారం చేయడంతో పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోను పార్టీ శ్రేణులు బాణసంచాలుపేల్చి, కేక్‌ కట్‌ చేసి, సంబరాలు చేసుకున్నారు.

 

పుంగనూరులో….

పుంగనూరు పట్టణంలోని బస్టాండులో పట్టణ పార్టీ అధ్యక్షుడు ఇప్తికార్‌, పారిశ్రామికవేత్త ఆర్‌విటి.బాబు , పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, ముస్లిం మైనార్టీల నాయకుడు అయూబ్‌ఖాన్‌, ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి ఆధ్వర్యంలో ప్లెక్సిలు ఏర్పాటు చేశారు. కేక్‌ కట్‌ చేసి, సంబరాలు చేశారు. ఎంబిటి రోడ్డు పొడువున బాణసంచాలు పేల్చారు. ప్రయాణికులు సైతం జగన్‌మోహన్‌రెడ్డి జిందాబాద్‌ అంటు సంబరాలు చేసుకోవడం గమనార్హం. అలాగే తహశీల్ధార్‌ కార్యాలయం వద్ద డాక్యూమెంట్‌రైటర్లు రామ్మూర్తి, త్యాగరాజు, డాక్టర్‌ రమణరావు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి, సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్ వెంకట్రమణరాజు, ఆయన సోదరుడు రామక్రిష్ణంరాజు పాల్గొన్నారు. అలాగే చింతలవీధిలో పట్టణ మహిళా అధ్యక్షురాలు రెడ్డెమ్మ, ముస్లిం మైనార్టీ మహిళా నేతలు రహత్‌జాన్‌, సల్మా, రాఫియా ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. అలాగే వర్థక వ్యాపారుల సంఘ ప్రతినిధులు వెంకటాచలపతిశెట్టి, అర్షద్‌అలి, వెంకటేష్‌, శ్రీధర్‌ల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి, సంబరాలు చేశారు. అలాగే ఇందిరా సర్కిల్‌లో అంబేద్కర్‌ దళిత సేవా సమితి నేతలు గంగాధర్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి, సంబరాలు నిర్వహించారు. కొత్తయిండ్లలో పార్టీ నేతలు వాసు, రాజశేఖర్‌రెడ్డి, గోపి, వెంకటరెడ్డి, వెంకట్రమణ, శ్రీనివాసులు, మహేష్‌ బాణసంచాలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. సుబేదారువీధిలో ముస్లిం నేతలు కిజర్‌ఖాన్‌, ఆసిఫ్‌, ఖాజా ఆధ్వర్యంలో ముస్లింలు కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. అలాగే రంజాన్‌ ఉపవాసంలో ఉన్న ముస్లింలకు ఇఫ్తార్‌విందు ఇచ్చారు. అలాగే ఉర్ధూస్కూల్‌వీధిలో సల్మాసుల్తాన, వెహోబినా ఆధ్వర్యంలో మహిళలు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమాలలో పార్టీ నేతలు ఫకృద్ధిన్‌ షరీఫ్‌, అమ్ము, కిజర్‌ఖాన్‌, అఫ్సర్‌, యువజన సంఘనాయకులు రాజేష్‌, బండకుమార్‌, తుంగామంజునాథ్‌, జెపి.యాదవ్‌, శ్రీనివాసులు, ఇర్షాద్‌బేగం, మహబూబ్‌బాషా, అమరనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

4 లక్షల గ్రామ వలంటీర్ల పోస్టులు

Tags: Celebrating YSRCP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *