Natyam ad

మంత్రి మల్లారెడ్డి ఇంటిదగ్గర సంబరాలు

మేడ్చల్ ముచ్చట్లు:


మేడ్చల్ అసెంబ్లీ స్థానానికి బిఆర్ఎస్ తరఫున మంత్రి మల్లారెడ్డి పేరు ఖరారు కావడంతో న్యూబోయిన్ పల్లి లోని ఆయన ఇంటి వద్ద సంబరాలు అంబరాన్ని అంటాయి.. మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలు ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకొని శుభాకాంక్షలు తెలిపి పుష్ప గుచ్చాలు అందజేశారు.. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తనకు తిరిగి మేడ్చల్ నుంచి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.  రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఆఖండ మెజారిటీతో తన గెలుపు ఖాయమని ప్రతిపక్షాల ఊసే లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తిరిగి గెలుపుకు దోహదపడతాయని పేర్కొన్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యల విషయంలో అధిష్టానమే చూసుకుంటుందని అన్నారు.

 

Tags: Celebrations near Minister Mallareddy’s house

Post Midle
Post Midle