Celebrations of the Holy Prophet in Milad

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబి పండుగ వేడుకలు

Date:30/10/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

మండలంలోని ముస్లిం మైనార్టీ సోదరులు శుక్రవారం మిలాద్‌ ఉన్‌ నబి పండుగను భక్తిశ్రద్దలతో వేడుకగా జరుపుకొన్నారు. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ తగిన జాగ్రత్తల నడుమ పండుగ విశిష్టతను ప్రజలకు మతగురువులు వివరించారు.దాదేపల్లె లోని మదీనా మజీద్‌ లో నిర్వాహకులు సనావుల్లా, ఎండీ అనీష్‌ తదితరులు కలిసి ప్రత్యేకంగా మసీదును ముస్తాబుచేశారు. పండుగ విశిష్టతను, మహమ్మద్‌ ప్రవక్త సందేశాన్ని మతగురువులు వివరించారు. యువత సన్మార్గంలో నడుచుకొంటు పేదలకు చేయూతనివ్వడంతోపాటు, ఆపదలో ఉన్నవారిని ఆదుకొనే స్వభావంతో నేర్చుకోవాలని సూచించారు. చిన్నతనుంచే పెద్దలను గౌరవించడంతో పాటు మంచి అలవాట్లు క్రమశిక్షణతో జీవన ప్రయాణం సాగించాలన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించి ప్రవక్త జీవితాన్ని హిత బోదన చేశారు. ఈ కార్యక్రమంలో గౌస్‌,మహమ్మద్‌,అస్లాం,సుల్తాన్‌ సాబ్‌,ఖాదర్‌ఖాన్‌ బషీర్‌,ఆబీదుల్లా,గులామ్‌హైదర్‌,జానుసాబ్‌,అమీర్‌సాబ్‌,అక్రమ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు పిల్లలు, తల్లి అదృశ్యం

Tags: Celebrations of the Holy Prophet in Milad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *