పుంగనూరులో రూ.2 లక్షలు విలువచేసే సెల్‌ఫోన్లు స్వాధీనం- సీఐ గంగిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

వివిధ ప్రాంతాలలో దొంగతనాలు కాబడిన 15 సెల్‌ఫోన్లు సుమారు రూ.2 లక్షలు విలువ చేసే వాటిని స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేస్తున్నట్లు అర్భన్‌ సీఐ గంగిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి, డిఎస్పీ గంగయ్య ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాలలో ప్రజల నుంచి చోరీకాబడిన సెల్‌ఫోన్ల వినియోగం శాయపద్దతిలో గుర్తించామన్నారు. వారి నుంచి సెల్‌ఫోన్లు రీకవరి చేసి ఎస్పీ ఆదేశాల మేరకు ఫిర్యాదు దారులకు అందజేస్తున్నామన్నారు. ఆయన మాట్లాడుతూ పుంగనూరు కర్నాటక సరిహద్దు ప్రాంతం కావడంతో ఆప్రాంత వాసులు పుంగనూరులోని రద్దీ ప్రాంతాలలో సంచరిస్తూ సునాయాసంగా పిట్‌ప్యాకెట్లు చేస్తున్నారన్నారు. ఈ సమయంలో నగదు, సెల్‌ఫోన్లు ప్రజలు పొగొట్టుకుంటున్నారని తెలిపారు. సంతలకు , రద్దీ ప్రాంతాలకు వెళ్లే వారు అధిక వెహోత్తంలో డబ్బులు తీసుకెళ్లడం, విలువైన ఫోన్లను తీసుకెళ్లకుండ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఇలాంటి విషయాల్లో అప్రమతంకావాలని కోరారు. దొంగతనం రీకవరీకి కృషి చేసిన పోలీసులు యల్లప్ప, కేశవరాజు, రవి లను సీఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags: Cell phones worth Rs 2 lakh seized in Punganur- CI Gangireddy

Leave A Reply

Your email address will not be published.