సెల్ టవర్ లేక ఇబ్బందులు

-వానలో తడుస్తూ వైఎస్సార్ భీమా ఆన్లైన్ కోసం వేచిచూస్తున్న ప్రజలు

 

పాడేరు ముచ్చట్లు :

 

పెదబయలు మండలము కిముడుపల్లి పంచాయతి పరిధిలో గల 23 గ్రామాల ప్రజలు ప్రభుత్వ పథకాలు పొందాలంటే సిగ్నల్స్ కోసం 5 కీలో మీటర్లు నడిచి కొండ మీద కు రావాల్సిందే, ఈ పంచాయతీలో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కీ ఫోన్ చెయ్యాలన్న, వాలింటర్లు ప్రభుత్వ పథకాల కు ఆన్లైన్ చెయ్యాలన్న నిత్యం ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి, అదే విధంగా ఈ రోజు జోరుగా కురుస్తున్న వానలో సైతం గిరిజనులు తడుస్తూ నిల్చొని ఆన్లైన్ చేయించు కోవాల్సిన పరిస్థితి, కాబట్టి ఐటీడీఏ ఉన్నతాధికారులు స్పందించి గిరిజనుల అభివృద్ధి ,సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ ప్రాంతంలో సెల్ టవర్ యేర్పాటు చెయ్యాలని, ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు అంగనైని ఆనంద్ మరియు స్ధానిక సర్పంచ్ మరియు పంచాయతి గిరిజన ప్రజల, గ్రామ పంచాయతి వాలంటీర్లు  తెలియజేసారు.

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Cell tower or trouble

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *