Natyam ad

పుంగనూరులో జగనన్న కాలనీలకు సిమెంటు రోడ్లు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణ సమీపంలోని గూడూరుపల్లె వద్ద గల జగనన్న కాలనీలకు సిమెంటు రోడ్లు వేసే కార్యక్రమాన్ని కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, చైర్మన్‌ అలీమ్‌బాషా భూమిపూజ చేసి ప్రారంభించారు. శనివారం రాష్ట్రజానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ముతో కలసి రోడ్డు పనులను ప్రారంభించారు. చైర్మన్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ల ఆదేశాల మేరకు పనులను ప్రారంభించామన్నారు. రోడ్లు, కాలువలతో పాటు పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యుద్దీకరణ పూర్తికావడం జరిగిందన్నారు. కాలనీలలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి గృహప్రవేశాలు త్వరగా నిర్వహించేలా పనులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, కౌన్సిలర్లు నరసింహులు, మనోహర్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, రాజేష్‌, సురేష్‌, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags; Cement roads to Jagananna colonies in Punganur

 

Post Midle