సెన్సార్ కార్య‌క్ర‌మాల్లో  `నేనే కేడీ నెం-1’  

Censor programs include 'Self Cade No. 1'

Censor programs include 'Self Cade No. 1'

Date:07/06/201 9

‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం  `నేనే కేడీ నెం`1’.  ఆర్ ఏ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్ పై  ఎం.డి రౌఫ్ స‌మ‌ర్ప‌ణ‌లో  జాని   స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.  ముస్కాన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్  కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం సెన్సార్ ప‌నులు జ‌రుపుకుంటోంది. జూన్ చివ‌రి వారంలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ  సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత జాని మాట్లాడుతూ…‘‘ మంచి ఎంట‌ర్‌టైన్ తో వ‌స్తోన్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్   `నేనే కేడి నెం-1`. ప్ర‌స్తుత స‌మాజంలో పిల్ల‌లు చెడు వ్య‌స‌నాల‌కు బానిస‌ల‌వుతున్నారంటే దానికి కార‌ణం త‌ల్లిదండ్రులు కూడా. నేటి బిజీ లైఫ్ లో త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను  ప‌ట్టించుకోకుండా, బాధ్య‌త‌లు తెల‌ప‌కుండా  పూర్తి స్వేచ్ఛ‌నిస్తూ గాలికి  వ‌దిలేస్తున్నారు. ఈ క్ర‌మంలో యువ‌త పెడ‌దోవ ప‌డుతోంది అనే అంశాన్ని మా సినిమాలో చూపించాం.  త‌ప్ప‌కుండా ప్రతి త‌ల్లిదండ్రీ తో పాటు పిల్ల‌లు చూడాల్సిన సినిమా ఇది.  ష‌క‌ల‌క శంక‌ర్ లోని మ‌రోకోణం మా సినిమాలో చూపించాం.  ఆడియ‌న్స్ కు కావాల్సిన క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌న్నీ జోడించాం. హీరోయిన్ గా ముస్కాన్ అందం, అభిన‌యం  అలాగే ముకుల్ దేవ్, పృథ్వీ పాత్ర‌లు సినిమాకు  స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలుస్తాయి.  ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. జూన్ చివ‌రి వారంలో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
ముకుల్ దేవ్, పృథ్వీ, పూజా, పి.డి.రాజు, క‌రాటే క‌ళ్యాణి, రాం జ‌గ‌న్, రాజేంద‌ర్, నాగ మ‌హేష్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి  సంగీతంః అజ‌య్ ప‌ట్నాయ‌క్‌;  కెమెరాః శ్రావ‌ణ్ కుమార్;  ఎడిట‌ర్ః స‌ములేటి శ్రీనివాస్ ;  స్టోరీ – స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం- నిర్మాతః జాని.

 

ప్రేమ‌జంట‌` సెన్సార్ పూర్తి.. జూన్ 28న గ్రాండ్ రిలీజ్‌

Tags:Censor programs include ‘Self Cade No. 1’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *