జనాభా లెక్కల సేకరణ ఏర్పాట్లు చేయాలి

Date:21/11/2019

వరంగల్ అర్బన్ ముచ్చట్లు:

జనాభా లెక్కలు-2021 సేకరణకు డిశెంబర్ 31 లోపు వ్యవస్థాపరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ ఇల్లంబర్తి స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ ప్రపంచం లోనే ప్రత్యేక గుర్తింపు పొందిన భారత జనాభా లెక్కల సేకరణను 16వ సారి చేపడుతున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం 8వ సారి జనాభా లెక్కలను తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ విడత జనాభ లెక్కలతో పాటు జాతీయ జనాభా రిజిష్టర్ ను  కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లను ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్లుగా నియమించినట్లు తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ ప్రాంతాల్లో మున్సిపల్ కమీషనర్ వ్యవహరిస్తారని  తెలిపారు. ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు, చార్జి ఆఫీసర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్ లకు ఈ నెలాఖరు నుండి హైదరాబాద్ ఎం.సి.హెచ్.ఆర్.డి.లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.  జనాభా లెక్కల సేకరణ, జాతీయ జనాభా రిజిష్టర్ ల నమోదుకు ప్రత్యేక యాప్ లను రూపొందించినట్లు తెలిపారు.జనన, మరణ నమోదుకు కూడా ప్రత్యేక యాప్ లు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులకు ఈ యాప్ లపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

 

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయలు

 

Tags:Census collection needs to be arranged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *