తెలంగాణపై కేంద్రం పక్షపాతం: కడియం

Center bias against Telangana: Kite
Date: 18/01/2018
హైదరాబాద్ ముచట్లు :
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… సీఎం కేసీఆర్, నేను స్వయంగా ప్రధానిని కలిసి కోరినా తెలంగాణకు ఒక్క విద్యాసంస్థ కూడా ఇవ్వలేదన్నారు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 విద్యాసంస్థలు ఇచ్చారని, తెలంగాణకు ఇవ్వడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థంగావడం లేదని కడియం అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే 5వేల పాఠశాలల విలీనం ఎక్కడ జరిగిందో బీజేపీ నేతలు చెప్తే చర్యలు తీసుకుంటామని కడియం పేర్కొన్నారు.
Tags: Center bias against Telangana: Kite