Natyam ad

తిరుప‌తి ఎస్వీ గోశాల‌లో రూ.46 కోట్ల‌తో సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స్‌లెన్స్

– ఎన్‌డిడిబి స‌హ‌కారంతో దేశవాళీ గో జాతుల అభివృద్ధి

– ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డి

 

తిరుమల ముచ్చట్లు:

 

Post Midle

దేశవాళీ గో జాతుల అభివృద్ధికి, జన్యుపరమైన సామర్థ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో తిరుపతిలోని ఎస్వీ గోసంరక్షణ శాలలో జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు, టీటీడీ సంయుక్తంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేస్తోంద‌ని ఈవో   ఎవి ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం తిరుమ‌ల‌లో తన కార్యాల‌యంలో ఈవో అధికారుల‌తో సమీక్ష‌ నిర్వ‌హించారు.ఈ సంద‌ర్బంగా ఈవో మాట్లాడుతూ, మత్స్య, పశుసంవర్ధక శాఖలు గోవుల‌ జన్యు పరిరక్షణ కోసం రూ.46 కోట్లు నిధులు మంజూరు చేశార‌న్నారు. ప్ర‌తి రోజు తిరుమ‌ల‌ శ్రీవేంకటేశ్వర స్వామి అన్ని సేవల‌కు 60-100 కిలోల నెయ్యి, మూడు వేల‌ లీటర్లు పాలు దేశవాళీ గో జాతుల నుండి ఉత్ప‌త్తి చేయ‌డానికి దేశావ‌ళి గోవుల‌ను అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా టీటీడీ ప‌నిచేస్తున్న‌ట్లు తెలిపారు.జన్యు మార్పిడి ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృత్రిమ గర్భధారణ మరియు పిండ బదిలీ వంటి అధునాతన పునఃరుత్పత్తి సాంకేతికతలపై కేంద్రం దృష్టి సారిస్తోంద‌న్నారు. జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు మరియు డెయిరీ సర్వీసెస్ మరియు రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద ఎన్‌డిడిబి విడుదల చేసిన నిధుల ద్వారా ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుందని ఈవో తెలిపారు.టీటీడీకి చెందిన ఎస్వీ గోసంరక్షణ శాలలో ఇప్పటికే దేశీ గోవుల పెంపకం, అభివృద్ధి దిశగా అనేక‌ కార్యక్రమాలను చేపడుతున్నదని చెప్పారు. ఎన్‌డీబీ, ఎన్‌డీఎస్‌లు సమన్వయం చేసుకుని ప్రాజెక్టులోని అన్ని భాగాలు విడుద‌ల అయిన‌ నిధుల ద్వారా పూర్తి చేయాల‌న్నారు.ఈ స‌మావేశంలో శ్రీ‌జా మ‌హిళా మిల్క్ ప్రొడ్యుస‌ర్ ఛైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌మ‌తి శ్రీ‌దేవి, ఎన్‌డిడిబి ఎండి డా. దేవానంద్‌, జేఈవో శ్రీమతి సదా భార్గవి, ఎఫ్ఎ అండ్ సిఎవో   బాలాజి, సిఇ   నాగేశ్వర్‌ రావు, గో శాల డైరెక్ట‌ర్   హ‌ర‌నాథ రెడ్డి, ఎస్వీ ప‌శు విశ్వ‌విద్యాల‌యం ప్రొఫెసర్లు డా.స‌ర్జ‌న్‌రావు, డా. వెంక‌ట‌నాయుడు త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Tags: Center for Excellence at Tirupati SV Goshala at a cost of Rs.46 crores

Post Midle