ఈఎస్ ఐ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్

న్యూఢిల్లీ ముచ్చట్లు :
మీరు ఈఎస్ఐ స్కీమ్‌లో చేరారా? అయితే మీకు తీపికబురు అందనుంది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. కరోనా వైరస్ కారణంగా ఈఎస్ఐ స్కీమ్‌లో చేరిన వారు మరణిస్తే.. వారి కుటుంబాలకు ప్రతి నెలా పెన్షన్ అందించాలని భావిస్తోంది.ఈఎస్‌ఐ లబ్ధిదారులు కరోనా వైరస్ వల్ల మరణిస్తే.. వారి కుటుంబాలకు నెలకు కనీసం రూ.1800 పెన్షన్ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అంశంపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు కూడా కోరుతోంది.కోవిడ్ 19 రిలీఫ్ ప్యాకేజీలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఈఎస్ఐ స్కీమ్‌లో చేరిన వారు మరణించే నాటికి ఆన్‌లైన్ పోర్టల్‌లో 3 నెలల ముందే రిజిస్టర్ చేసుకొని ఉండాలి. అప్పుడే ఈ బెనిఫిట్ పొందటానికి అర్హులు.పెన్షన్ డబ్బులు నేరుగా లబ్ధిదారుల కుటుంబానికి చెందిన అర్హత కలిగిన సభ్యుని బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అంతేకాకుండా అంత్యక్రియలకు రూ.15 వేలు అందిస్తారు. ఇకపోతే కోవిడ్ 19 చికిత్స చేయించుకుంటున్న లబ్ధిదారులకు వారి చికిత్స కాలంలో కూడా వేతనం లభిస్తుంది. ఈఎస్‌ఐ జీతం చెల్లిస్తుంది.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:Center Good News for ESI Beneficiaries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *