కేంద్రం తీరు దుర్మార్గం

Center is a bad way

Center is a bad way

Date:12/02/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:
మంగళవారం నాడు అశోకా రోడ్డు లోని ఏపీ భవన్ నుంచి జంతర్ మంతర్ వరకు ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు  పాదయాత్ర చేసారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం చేసింది.   కేంద్రం ప్రతి అంశాన్ని తప్పుదోవ పట్టిస్తుంది.   కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.   కోట్లాది ప్రజల మనోభావాలతో కేంద్రం ఆడుకుంటోంది.   ఇవాళ రాష్ట్రం మొత్తం ఢిల్లీ వీధుల్లో నడుస్తోంది..సమైక్యంగా అందరూ మాకు మద్దతిస్తున్నారు.   హక్కుల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, జర్నలిస్టు సంఘాలతో కలిసి రాష్ట్రపతి వద్దకు వెళ్తున్నాం. వారందరితో కలిసి ఉద్యమిస్తామని అన్నారు.
కులాలకు, మతాలకు అతీతంగా పోరాడుతున్నాం.   ప్రధాని మోదీ గవర్నమెంట్ మమ్మల్ని నమ్మించి మోసం చేసింది.   హైదరాబాద్ లో 60 యేళ్లు కష్టపడి అభివృద్ధి చేసి కట్టుబట్టలతో ఏపీకి వచ్చాం.   వారితో సమానంగా రావడానికి 20 నుండి 30 యేళ్ల సమయం పడుతుంది..అది కూడా వస్తామో లేదో కూడా చెప్పలేం.   కష్టాల్లో మనం ఉంటే మన జీవితాలతో ఆడుకుంటున్నారు.  మా పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గం.. దారుణమని అన్నారు.   మా జీవితాలతో దయచేసి ఆడుకోవద్దని, మా మనోభావాలు దెబ్బతీయవద్దని హెచ్చరిస్తున్నాం.అదే జరిగితే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు.   మా భావితరాలకు భరోసా ఇవ్వమని కోరితే వారి భవిష్యత్ తో ఆడుకుంటున్నారు.   మా జీవితాలతో ఆడుకోవద్దని ఇవాళ 5 కోట్ల ప్రజల తరపున హెచ్చరిస్తున్నాం.    ఇది త్యాగం. ఢిల్లీ నడి వీధుల్లో మాకు నడవాల్సిన అవసరం లేదు. మా హక్కుల కోసం నడిచాం. దేశ రాజధాని కాబట్టే ఇవాళ నడిచాం.ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.   మేమేం చేయలేం అనుకుంటే పొరపాటు.
ఏపీ మీ గుండెలో నిద్రపోతుందని హెచ్చరించారు.   ఆంధ్రప్రదేశ్ కి  జరిగిన అన్యాయాన్ని దేశమంతా చూస్తోంది. న్యాయంగా మా హక్కులను సాధించుకుంటాం. అంత వరకు మా పోరాటం ఆగదు.  రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెబుతారు.   ప్రజాక్షేత్రంలో అంతిమ తీర్పు వస్తుంది.   ప్రజాకోర్టుకు వెళ్లి  మీ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడిస్తామని అన్నారు.   మోదీ, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ ఒకటే.. మోదీ అభీష్టం..జగన్ ఆచరణ అని విమర్శించారు.   కేసుల కోసం, స్వ ప్రయోజనాల కోసం జగన్  మోహన్ రెడ్డి మోదీకి ఊడిగం చేస్తున్నారు.   మోదీ కాళ్లను జగన్ కడిగినా మాకేమీ అభ్యంతరం లేదు.   ప్రజాస్వామ్యంలో మేం ఏమేం చేయాలో చేస్తున్నాం. చేయాలి కూడా. తొలుత పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టాం. వినలేదని అన్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా ధర్మపోరాట దీక్షలు చేశాం..వినలేదు.
 ఢిల్లీలోనూ ధర్మపోరాటం  చేశాం. అయినా వినలేదు.  నిన్న మహామహులు ఒకే వేదిక పైకి వచ్చి ఏపీ తరపున స్వరం వినిపించారు.. అయినా కేంద్ర ప్రభుత్వం వినలేదని అన్నారు.   ఏపీ భవన్ నుంచి జంతర్ మంతర్ వరకు పాదయాత్ర చేస్తున్నాం.. అయినా వినలేదు.   రాష్ట్రపతి కి చెబుతున్నాం . వినలేదు.   ధర్నాలు, నిరసనలు చేశామని అన్నారు. •  మేం రాజకీయ ప్రయోజనాల కోసం కాదు ప్రజా ప్రయోజనాల కోసం పోరుడుతన్నాం. మా  ఈ పోరాటం ప్రజా పోరాటమని అన్నారు.   అంతిమంగా ప్రజాకోర్టుకు వెళదాం. అక్కడే మిమ్మల్ని శిక్షిస్తాం..ప్రజలే మిమ్మల్ని శిక్షిస్తారు.   ఈరోజు మేం చేసే పోరాటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమని ఆయన అన్నారు..
Tags:Center is a bad way

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *