కేంద్రం కుంటిసాకులు  : సుజనా చౌదరి

Center Kuntis: Sujana Chaudhary

Center Kuntis: Sujana Chaudhary

Date:20/10/2018
విజయవాడ ముచ్చట్లు:
కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ప్రతిపాదనలు సమర్పించలేదని కేంద్రం చెప్పడం హాస్యాస్పదమని టీడీపీ నేత సుజనా చౌదరి తెలిపారు. తాము అన్ని వివరాలను ఇచ్చినా కేంద్ర ఉక్కు మంత్రి మాత్రం ఇవ్వలేదని చెబుతున్నారని విమర్శించారు. మూడు మిలియన్‌ టన్నుల కెపాసిటీ ప్లాంట్‌ ఏర్పాటుకు కావాల్సిన సమగ్ర సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. అది ఇవ్వలేదు..
ఇది ఇవ్వలేదు అని ఇంకా చెప్పటం కుంటి సాకులేనని అన్నారు. ఇచ్చిన సమాచారం ఓసారి సరిచూసుకోవాలని హితవు పలికారు. ఉద్దేశపూర్వకంగా రాష్ట్రానికి నష్టం చేకూర్చే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం జరిగేలా కేంద్ర పెద్దలు వ్యవహరిస్తోన్నారని ధ్వజమెత్తారు.
ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక కక్షపూరితంగా కేంద్రం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.రాష్ట్రంలో టీడీపీ నేతలు, వ్యాపార సంస్థలు లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు.ఐటీ అధికారులు వస్తుంటారు, పోతుంటారనీ, వాళ్లు తమనేం చేయలేరని సుజనా చౌదరి స్పష్టం చేశారు. 3 మిలియన్ టన్నుల ఉత్పాదక ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు కావాల్సిన సమగ్ర ప్రతిపాదనలను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సాయం చేయడం ఇష్టం లేని కేంద్రం కుంటిసాకులు చెబుతోందని దుయ్యబట్టారు.
ఎన్టీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ కేంద్రం చేస్తోందని ఆరోపించారు. ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఏడుసార్లు సమగ్ర వివరాలు అందించామన్నారు. 48 గంటల్లో మరోసారి కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర వివరాలు అందజేస్తామన్నారు. ఇప్పటికైనా కేంద్రం కక్ష సాధింపు చర్యలను మానుకుని స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ విషయంలోనూ కేంద్రం తీరు ఏమాత్రం మారలేదని దుయ్యబట్టారు.
Tags:Center Kuntis: Sujana Chaudhary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *