రాష్ట్రాలకు కేంద్రం లేఖ ఆంక్షల సడలింపులపై సూచన

న్యూఢిల్లీ    ముచ్చట్లు:
అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాసారు. పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షల సడలింపుల నేపథ్యంలో సూచనలు చేసారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడం ఆధారంగా ఆంక్షల విధించడం లేదా సడలింపులు ఇవ్వాలి.  ఆంక్షల మినహాయింపుల అనంతరం కూడా కరోనా నియంత్రణకు 5 సూత్రాలను అమలు చేయాలి. టెస్టింగ్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్, నిరంతర నిఘా నియమాలను పాటించాలని సూచించారు. పరీక్షల సంఖ్యను తగ్గించకుండా కొనసాగించాలి. కేసుల సంఖ్య పెరిగినా, పాజిటివిటీ రేటు అధికంగా నమోదైనా ప్రాంతాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలి. వ్యాక్సినేషన్ ద్వారా కరోనా చైన్ సిస్టంను  విచ్ఛిన్నం చేయడం చాలా కీలకమని అన్నారు. ఇందుకోసం రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. పరిస్థితిని నిశితంగా పరిశీలించి కార్యకలాపాలు జాగ్రత్తగా పునఃప్రారంభించాలని సూచించారు. ఇందుకోసం జిల్లా, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పేర్కోన్నారు.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Center letter to states

Reference on relaxation of sanctions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *