Natyam ad

నాగార్జున్‌సాగర్‌పై ఈనెల 8న కేంద్రం సమావేశం

న్యూఢిల్లీ ముచ్చట్లు:

నాగార్జునసాగర్‌పై ఈ నెల 8న కేంద్రం సమావేశం జరుగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకావాలని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో జరుగనున్న సమావేశానికి ఫిజికల్‌గా హాజరుకావాలని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశించింది. అయితే తొలుత 6న సమావేశం ఉంటుందని లేఖలో చెప్పినప్పటికీ తుఫాను కారణంగా ఈ భేటీని 8కి వాయిదా వేసినట్టు కేంద్ర జలవనరుల శాఖ సమాచారం ఇచ్చింది.

 

Tags: Center meeting on Nagarjunsagar on 8th of this month

Post Midle
Post Midle