అర్ధం కాని కేంద్రం అంతరంగం

Date:13/03/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం పై నిప్పులు చెరుగుతున్నాయి విపక్షాలు. రోజులానే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనలు చేశారు. మరోవైపు అసెంబ్లీలో సిఎం చంద్రబాబునాయుడు బీజేపీ తీరును తప్పు పట్టారు. విభజన హామీలను అమలు చేసే విషయంలో బీజేపీ అబద్దాలు ఆడుతుందని మండిపడ్డారు. వీలున్నంత వరకు బీజేపీ తప్పు చేసిందనే విషయాన్ని సభలో ప్రస్తావించారు. మాకు కావాల్సింది దక్కించుకోవడం కోసం ఏం చేయాలో బాగా తెలుసు. అందుకే తమ పార్టీ నేతలు మంత్రులుగా రాజీనామా చేశారన్నారు. ఏపీకి అన్యాయం చేస్తే ఏం జరుగుతుందో బీజేపీకి త్వరలోనే తెలుస్తుందన్నారు. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లిన ఏ పార్టీలు చరిత్రలో బాగు పడలేదన్నారు. మొత్తంగా చంద్రబాబు సభలో బీజేపీ చేసిన ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు ఆ పార్టీ నేతలు. హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ ఇప్పుడు మాట మార్చింది. ఎదురుదాడి చేస్తోంది. అది మంచి పద్దతి కాదని హితవు పలుకుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే పేరుతో రోజుకో రకంగా చంద్రబాబు బీజేపీ తీరును ఎండగడుతున్నారు. కేంద్రం ఏపీని ఆదుకోవాల్సింది పోయి ఇప్పటికీ మాటలు మాత్రమే చెబుతోందన్నారు. హోదా, రాయితీలు ఇవ్వలేమని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నిర్మొహమాటంగా చెప్పారు. అందుకే కేంద్రం నుంచి వైదొలిగామని చంద్రబాబు అన్నారు. వాజ్‌పేయి హయాంలో 29మంది ఎంపీలున్నా కేంద్రంలో చేరలేదు. ఏ షరతులు లేకుండా అప్పట్లో మద్దతిచ్చాం. కేంద్రంలో పదవుల కోసం టీడీపీ ఎప్పుడూ ఆరాటపడలేదని గుర్తు చేశారు. హోదా ఉన్న రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలు పొడిగించారు. ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వరని చంద్రబాబు అడిగారు. మొత్తంగా చంద్రబాబు మాటలతో బీజేపీ ఇరకాటంలో పడింది. రోజు సమావేశాలు పెట్టుకోవడం టీడీపీ పై ఎదురు దాడి చేయాలని నిర్ణయించడం తప్ప కమలం నేతలు ఏం చేయలేకపోతున్నారు. మరోవైపు వైకాపా నేతలు నామ మాత్రంగా ఆందోళనలు చేస్తు మీడియాలో నానేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మొత్తంగా హోదా కోసం అది చేస్తాం. ఇది చేస్తామన్న పవన్ కల్యాణ్ మౌనం దాల్చగా.. టీడీపీ, వైకాపాలు పోరాటం చేస్తున్నాయి. కాంగ్రెస్ చేస్తున్నామంటే చేస్తున్నామన్న చందంగా నిరసన తెలుపుతోంది.
Tags: Center of Meaningless Point

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *