పోలవరంపై కేంద్రం కొర్రీలు

Center on the porch

Center on the porch

Date:08/11/2018
ఏలూరు ముచ్చట్లు:
 పోలవరంపై అనునిత్యం కొర్రీలు వేసే కేంద్ర ప్రభుత్వం జరిగిన పనులకు కూడా నిధువ్వకుండా అడ్డం పడుతోరది. ఇప్పటివరకు 3,161 కోట్ల రూపాయల వరకు బకాయిలు రావాల్సి ఉంది. జరిగిన పనులకు బిల్లులు పంపించినప్పటికీ నిధులు మంజూరు కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు భరించాల్సి వస్తోందని అధికారులు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నురచి ఇప్పటివరకు 15వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
ఇందులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత రూ.9,889 కోట్లు వెచ్చిరచినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నాలుగేళ్లలో కేంద్రం నుంచి రూ.6727 కోట్లు రీయిరబర్స్‌ కాగా, మిగిలిన రూ.3161 కోట్లు ఇరకా పెండింగ్‌లోనే ఉండిపోయాయి. పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్న నేపథ్యంలో మిగిలిన పెండింగ్‌ నిధులను తక్షణమే ఇవ్వాలని పలు దఫాలుగా కేంద్రాన్ని, పోలవరం అథారిటీని కోరినప్పటికీ,  నిధులు రాలేదని అధికారులు చెబుతున్నారు.
జరిగిన పనులకు బిల్లులను కూడా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పంపించినట్లు వారు చెబుతున్నారు. 2017-18 సంవత్సరానికి రూ.3,787 కోట్లకు 1,398 బిల్లులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,281 కోట్లకు 3,583 బిల్లులు పోలవరం అథారిటీకి పంపించారు. ఇరకా దాదాపు 400 కోట్ల రూపాయలకు బిల్లులు సమర్పించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. మొత్తం ఈ ఏడాదిన్నరలో రూ.5,150 కోట్ల వరకు బిల్లులు సమర్పించినప్పటికీ, ఇరకా 3,161 కోట్లు రావాల్సి ఉందని ఆయన వివరించారు.
పెండింగ్‌ బిల్లుల ప్రభావం పనులపైనా పడుతోందని నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. ప్రాజెక్టు అంచనా విలువ భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో తలెత్తుతున్న ఆర్థిక సమస్యలు, పెండింగ్‌ బిల్లుల రూపంలో కూడా నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం 16 వేల కోట్ల రూపాయల అంచనాతో ఉన్న ఈ ప్రాజెక్టు అంచనా విలువ ప్రస్తుతం రూ.57,940 కోట్లకు చేరిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో కాఫర్‌డ్యామ్‌, గేట్ల పనులను కొంతవరకు పూర్తి చేసినప్పటికీ మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయడం ఇప్పట్లో సాధ్యం కాదని వారు తేల్చిచెబుతున్నారు. ఇప్పటికైనా నిధుల్ని విడుదల చేయాలని రాష్ట్ర అధికారులు కేంద్రాన్ని కోరుతున్నారు.
Tags: Center on the porch

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed