74 కోట్ల టీకాలకు కేంద్రం ఆర్డర్

న్యూఢిల్లీముచ్చట్లు:

ఆగస్టు నుంచి 44 కోట్ల కరోనా టీకా డోసులు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి ఆయా సంస్థలకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపింది. 19 కోట్ల కొవాగ్జిన్‌  వ్యాక్సిన్ డోసుల కోసం భారత్‌ బయోటెక్‌కు.. 25 కోట్ల కొవిషీల్డ్‌ టీకా డోసుల కోసం సీరం ఇన్‌స్టిట్యూట్‌కు ఆర్డర్లు పెట్టినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. మరోవైపు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న బయోలాజికల్‌-ఇ రూపొందిస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ 30 కోట్ల డోసులను ఇప్పటికే బుక్‌ చేసుకున్నట్లు కేంద్రం గతవారం ప్రకటించింది. అయితే.. ఈ వ్యాక్సిన్ వినియోగానికి ఇంకా అనుమతులు రావాల్సి ఉందిదేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో కేంద్రమే అర్హులందరికీ ఫ్రీగా టీకాలు అందజేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే భారీ మొత్తంలో టీకా డోసుల కోసం ఆర్డర్‌ చేసింది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Center orders 74 crore vaccines

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *