కేంద్రం వైఖరి మార్చుకోవాలి
నల్గొండ ముచ్చట్లు:
బి ఆర్ యస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యతిరేకించారు . రాజకీయంగా కక్ష్య సాధింపు దోరణీతోనే ఆమెకు నోటిసులు ఇవ్వడం జరిగింది అన్నారు. చట్టాలను తన చుట్టాలుగా మార్చుకొని ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులు పెట్టె ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని ఆయన చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని గుత్తా సుఖేందర్ రెడ్డి హెచ్చరించారు.
Tags: Center should change its attitude

