Natyam ad

కేంద్రమా… రాష్ట్రమా…ఎవరికి ఎవరు…

విజయవాడ ముచ్చట్లు:

చంద్రబాబు అరెస్టు, రిమాండ్ నుంచి మీడియా పతాక శీర్షికల్లో కేసులపై వాదోపవాదాలే వార్తలవుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు వీటి మీదనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. స్కిల్ స్కాం కేసు తర్వాత వరుసగా మరో నాలుగైదు కేసులు పెట్టడంపై రాజకీయంగా కక్ష సాధింపేనన్న భావన సగటు జనంలో నాటుకుంది. ప్రధాన పార్టీల మద్దతుదారులు ఆయా పార్టీల వైపు ఏకీకృతమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబును జైలులో పెట్టడంపై రెండు తెలుగు రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీకి సెగ తగులుతోంది. రాష్ట్రంలోని తటస్థ ఓటర్లను ప్రభుత్వ తీరు ఆలోచనలో పడేసింది. బాబుపై నమోదైన వరుస కేసులు.. వాటిపై కోర్టుల్లో వాదోపవాదాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నారనే భావన నానాటికీ బలపడుతోంది. దీంతో బీజేపీ పెద్దలు తమకేం తెలీనట్లు సంకేతాలిస్తున్నారు. మొన్న అమిత్ షాతో లోకేశ్ భేటీ.. ఇప్పుడు బాబు ఆరోగ్యం గురించి ప్రధాని మోడీ ఆరా తీయడం అందులో భాగమేనన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ సైతం తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని..

 

 

 

Post Midle

కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇచ్చిన ఆధారాలతోనే ప్రభుత్వం ముందుకెళ్లినట్లు చెప్పుకొచ్చారుఎవరి బలాలేమిటో దగ్గర పడిన ఎన్నికల్లో తేల్చుకోవాలేగానీ ఇలా కేసులు పెట్టి వేధించడమేంటనే అభిప్రాయం తటస్థుల్లో వ్యక్తమవుతోంది. ఇది రాజకీయంగా నష్టమని భావించిన అధికార పార్టీ ప్లేటు ఫిరాయించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇచ్చిన ఆధారాలతోనే సీఐడీ ముందుకెళ్లిందని బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టింది.మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా బలం పుంజుకొని బీఆర్ఎస్ను చాలెంజ్ చేస్తోంది. బీజేపీని చిట్టచివరి స్థానానికి నెట్టేసింది. ప్రస్తుతం వెలువడుతున్న జాతీయ సర్వేలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబుపై కేసుల వెనుక బీజేపీ, వైసీపీ, బీఆర్ఎస్ ఉన్నాయని టీడీపీ శ్రేణుల్లో బలంగా నాటుకుపోయింది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సెటిలర్స్ ఆందోళనలు చేయడం కొంప ముంచుతుందనే భయం ఆయా పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

 

 

 

బాబు అరెస్టు దురదృష్టమని బీఆర్ఎస్ నేతలు సన్నాయి నొక్కులు నొక్కినా.. అమిత్ షా, ప్రధాని మోడీ ఆలస్యంగా స్పందించినా ఇప్పటికిప్పుడు సెటిలర్స్లో ఈ పార్టీల పట్ల సానుకూలత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. స్కిల్ స్కాం కేసును సీబీఐకి అప్పగించేందుకు తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తద్వారా వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి రాజకీయ కక్ష లేదన్నట్లు సంకేతాలిస్తోంది. చంద్రబాబు జుత్తును బీజేపీ చేతిలో పెట్టడం కోసం సీబీఐని తెర మీదకు తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది. అమిత్ షాతో భేటీ అనంతరం నారా లోకేశ్ ఎన్డీయే, ఇండియా కూటమిలకు సమదూరంలో ఉన్నట్లు వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర రథ సారధి పురందేశ్వరి టీడీపీ, బీజేపీ శ్రేణులను దగ్గర చేసేట్లుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు వాపోతున్నారు. ఈ పరిణామాలతో బీజేపీ గేమ్ ప్లాన్లో ఎవరు పావులుగా మారతారనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 

Tags: Center…state…to whom…

Post Midle