కేంద్రం వర్సెస్ రాష్ట్రం

హైదరాబాద్ ముచ్చట్లు:

మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని 54,06,070 ఇండ్లకు స్వచ్ఛమైన జలాలు అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించింది. మిగతా ఇది 98% అని రిపోర్టులో పేర్కొన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83,03,612 ఇండ్లున్నాయని, 54,06,070 గృహాలంటే 98% ఇండ్లు కాదని కేంద్రం తప్పుపడుతున్నది. ఈ మేరకు థర్డ్ పార్టీ ఎంక్వైరీ కింద జల్ జీవన్ మిషన్ అధికారులను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపింది. చాలా గ్రామాల్లో పాత ట్యాంకులకు రంగులు వేశారని, పాత పైప్ లైన్లనే వినియోగిస్తున్నారని పేర్కొంటూ అధికారులు కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఇంతకు రాష్ట్రంలో ఉన్న కుటుంబాలెన్ని..? స్వచ్ఛ జలాలు అందుతున్నది ఎన్ని ఫ్యామిలీలకు అనేది ప్రశ్నార్థకంగా మారింది.మిషన్భగీరథపై బల నిరూపణ మొదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకంపై యుద్ధానికి దిగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా 98% ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చామని చెప్పడంతో కేంద్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జల జీవన్ మిషన్ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలినలు చేసి కీలక నివేదికను సమర్పించింది. నల్గొండ, సిద్దిపేట, నిర్మల్, కామరెడ్డి, కరీంనగర్, ఉమ్మడి మహబూబ్నగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ బృందం ఫీల్డ్ విజిట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టులో చాలా తప్పులున్నాయని రిపోర్ట్ లో పేర్కొన్నది.రూ.46 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర ప్రభుత్వం నివేదికల్లో వెల్లడించింది.

 

రాష్ట్రంలోని 33 జిల్లాలను 26 సెగ్మెంట్లుగా విభజించి ఇప్పటి వరకు 69 ఇంటెక్ వెల్స్ ను, 113 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, 1,708 మెయిన్ ట్యాంకులు, 35,260 విలేజ్ ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించారు. మొత్తం కొత్తగా 1.50లక్షల కిలోమీటర్ల మేర పైపులైన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 98% ఇండ్లకు నల్లాలు బిగించారు. ఇంకా 2% మాత్రమే పని పెండింగ్ ఉంది. మిగిలిన 2 శాతం పనులను కంప్లీట్ చేసేందుకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం చేయాలి. ఇదీ రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదిక.కేంద్ర జల జీవన్ మిషన్ బృందం పలు అంశాలను వివరిస్తూ కేంద్రానికి నివేదించినట్లు అధికారులు చెప్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 83,03,612 ఇండ్లు ఉన్నట్లు గుర్తించింది. రాష్ట్ర ప్రణాళికా విభాగం గతేడాది రిపోర్టులో 89,49,169 ఇండ్లు ఉన్నట్లు తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వం 54,06,070 ఇండ్లకు మిషన్ భగీరథ నీరు ఇస్తున్నట్లు నివేదికలో స్పష్టం చేసింది. ఈ లెక్కన 2011 జనాభా లెక్కల ప్రకారమే ఇంకా 28, 97, 542 ఇండ్లకు మిషన్ భగీరథ నీరు ఇవ్వడం లేదని కేంద్ర బృందం పేర్కొన్నది48 శాతం పాత పైపులైన్ల ద్వారానే మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నారని,

 

Post Midle

చాలాచోట్ల కాంట్రాక్టర్లు పనులు చేయకుండానే పాత లైన్లను చూపించి బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలనూ కేంద్ర బృందం ప్రస్తావించింది. దీనిపై ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో గుర్తించినట్లు ఉదాహరణలతో వెల్లడించింది. కొన్ని గ్రామాల్లో పాత ట్యాంకులకు రంగులు వేశారని, వాటి నిర్మాణాల వివరాలు, పాత ఫొటోలను ఈ బృందం సేకరించినట్లు తెలిసింది.ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ భగీరథపై వాదనకు దిగినట్లుగా మారింది. రూ. 40 వేల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. మిగతా రాష్ట్రాల్లో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ఖర్చుపై కేంద్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. ఇప్పుడు రాష్ట్రంలో కేవలం 2% పనులకు నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రాన్ని అడిగిన నేపథ్యంలో ఖర్చులపై చర్చ మొదలైంది. జల్ జీవన్ మిషన్ లో భాగంగా అన్ని రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేస్తున్నదని, పక్కనే ఉన్న ఏపీకీ నిధులిచ్చిందని, అక్కడ 51.8% పనులు అయినట్లుగా రిపోర్టు ఇచ్చారని, తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచీ సొంత పథకం అని చెప్పుకుంటూ నిధుల కోసం లేఖ రాయడంపై కేంద్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ తప్పుడు లెక్కలు చూపిస్తున్నదని కేంద్రం ఫైర్ అవుతున్నది. సొంత నిధులతో ఇంటింటికీ నల్లాలు పెట్టి సురక్షిత మంచినీటిని అందిస్తున్నామని రాష్ట్రం అంటున్నది. కేవలం 2 శాతం నిధులను అడిగితే.. పథకంపై అనుమానాలు వ్యక్తం చేయడంతోపాటు ఏకంగా థర్డ్ పార్టీని సర్వేకు పంపడాన్ని తెలంగాణ రాష్ట్రం తప్పు పడుతున్నది.

 

Tags: Center vs. State

Post Midle
Natyam ad