కేంద్రం నూతన వ్యాక్సీన్ విధానాన్ని స్వాగతించిన ఓవైసీ

హైదరాబాద్  ముచ్చట్లు:

 

వ్యాక్సీన్ పాలసీలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులను హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినత అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. వ్యాక్సినేషన్ కోసం ‘కొవిన్’ అనే ఆన్‌లైన్ పోర్టల్‌‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని మొదటి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోన్న ఓవైసీ నేరుగా వ్యాక్సినేషన్ చేసే ‘వాక్ ఇన్ వ్యాక్సినేషన్’ విధానాన్ని అభినందించారు. కొవిన్ రిజిస్ట్రేషన్‌పై సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని ఊటంకిస్తూ ఈ డిజిటల్ విధానం వల్ల దేశంలో అనేక మంది వ్యాక్సినేషన్‌కు దూరంగా మిగిలిపోతారని, ఇది ప్రజల మధ్య విభజల్ని తీసుకువస్తుందని అన్నారు. కేంద్రం నూతన విధానంలో వ్యాక్సినేషన్‌లో రాష్ట్రాలకు అధికారాలు కల్పించడంపై ఓవైసీ సంతృప్తి వ్యక్తం చేశారు.18-44 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి ఒక్కరు నేరుగా వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లి వ్యాక్సీన్ తీసుకోవడానికి అనుమతిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మే 24న ప్రకటించింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వల్ల దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ సరిగా అమలు కావడం లేదనే విమర్శలు వచ్చాయి.

 

 

 

ప్రజలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌పై అవగాహన లేకపోవడం, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో లేకపోవడం, స్మార్ట్‌ఫోన్లు/మొబైల్ ఫోన్లు అందరి వద్ద లేకపోవడం వల్ల చాలా మంది వ్యాక్సీనేషన్‌కు దూరమవుతున్నారని సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నేరుగా కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లోనే వ్యాక్సీన్ తీసుకునే విధంగా కేంద్రం మార్పులు చేసింది. ఈ విషయాన్ని ఓవైసీ ప్రస్తావిస్తూ ‘‘దేశంలో కేవలం 25 మందికి మాత్రమే ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లు చాలా మంది వద్ద ఉన్నప్పటికీ 80 శాతం మందికి టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. కొవిన్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేయడం సాధ్యం కాదు. దాన్ని రద్దు చేయాలి’’ అని అన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Center welcomes new vaccine policy OYC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *