కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలు తగ్గించాలి
కడప ముచ్చట్లు:
జిల్లా కాంగ్రెస్ కమిటీ. ఆధ్వర్యంలో గురువారం కడప కొత్త కలెక్టరేట్ ఎదురుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మల్లెం. విజయ భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెట్రోలు, డీజల్, వంట గ్యాస్, జిఎస్టి, నిత్యావసర ధరలు, మరి నిరుద్యోగ సమస్య, అధిక భారం లతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కోట్లాది రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుండి దోచుకుంటున్నారు, ప్రతి పేదవాడి పై అధిక ధరల బాదుడు లు. మోపి ప్రజలకు కన్నీళ్లు తెప్పించు చు న్నారని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ పెంచుతుంటే. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఎందుకు ప్రశ్నించలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిజెపి కి తొత్తుగా మారిపోయారు అన్నారు. తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను బలిపశువులు గా చేశారని మాట్లాడారు. రాష్ట్రంలో నవరత్నాలు తప్ప ఎటువంటి సంక్షేమ అభివృద్ధి జరగలేదన్నారు. అలాగే బిజెపి ప్రభుత్వం నిరుద్యోగ సమస్య అధికమైంది అన్నారు .
ఇప్పటివరకు ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు ఒక ఉద్యోగమైనా ఇచ్చారా అన్నారు ఉన్న ప్రభుత్వ సంస్థలు అన్ని ప్రైవేటు పరం చేశారని అన్నారు. జిఎస్టి పన్నుల పేరుతో దేశ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి అధిక ధరలు తగ్గించి ప్రజలకు మంచి పాలన అందించాలని కోరారు ధరలను తగ్గించకపోతే. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో బీజేపీకి వైసీపీకి గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా తెలిపారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని రేపు రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమని అలాగే ఈ దేశానికి మంచి పాలన అందించగలరని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో. రాష్ట్ర నాయకులు. జోడు నాగరాజు, ఆ రిపుల్లా, అలీ ఖాన్, విజయ్ కుమార్, కుల్లాయప్ప, గొర్ల శ్రీనివాసులు, అయ్యవారు, నా సీర్ అలీఖాన్, ఆనందరావు, మైద్దీన్, సురేష్, రాము, గౌరీ, సంతోషమ్మ, సత్యం అన్వర్ బుడిగి శీను తదితరులు పాల్గొన్నారు.
Tags: Central and state governments should reduce high prices