కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేయాలి

కడప ముచ్చట్లు:

 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రైస్తవుల సంక్షేమానికి, అభివృద్ధి కోసం కృషి చేయాలని,జిల్లాలో ఉన్న క్రైస్తవ మత చర్చీలు అభివృద్ధి,ఆవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని వరల్డ్ పీస్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్ చైర్మన్ రెవ డా బిషప్ కె శామ్యూల్ బాబు అన్నారు శనివారం నగరంలోని తన కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడారు దళిత  క్రైస్తవులకు ఎస్సీ హోదాను కల్పించి ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు  జిల్లాలో ఉన్న చర్చిల అభివృద్ధి కోసం కృషి చేసి క్రైస్తవులకు ఇల్లు, ఇల్ల స్థలాలు ఇచ్చి వారికి ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేయాలని కోరారు పాస్టర్లు కు గౌరవ వేతనం మంజూరు చేయడం పట్ల బిషప్ హర్షం వ్యక్తం చేశారు క్రైస్తవ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు క్రైస్తవుల పై దాడులు నిరోధించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు అన్ని మతాలను సమానంగా, ఆర్థిక, సామాజిక కోణంలో చూడాలని అన్నారు.

 

Tags:Central and state governments should work for the welfare of Christians

Leave A Reply

Your email address will not be published.