శాంతియుత నిరసనలను సహించని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ మంథని డివిజన్ అధ్యక్షుడు గోటికార్ కిషన్ జీ
మంథని ముచ్చట్లు:
రాహుల్ గాంధీపై బిజెపి ప్రభుత్వం ఈడిని ప్రయోగించి వేదిస్తూన్నందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా రాజ్ భవన్ వైపు వెళ్తున్న సమయంలో రాష్ట్ర పోలీసులు అకారణంగా లాఠి చార్జీ చేసి యువజనకాంగ్రెస్, విద్యార్థి నాయకులను, మహిళా కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పశువులను బాదినట్టు బాదడం, ప్రజాస్వామ్య దేశంలో అత్యంత హేయమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ మంథని డివిజన్ అధ్యక్షుడు గోటికార్ కిషన్ జీ విమర్శించారు. మోదీ, అమిత్ షా అదేశాలతో కేసిఆర్ సర్కార్ ఈ దమన కాండకు పాల్పడినట్లు సృష్పమవుతున్నదన్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతున్నందున కాంగ్రెస్ ను అంతమొదించాలని, టిఆర్ఎస్, బిజెపి కుమ్మక్కై ఈ చర్యలకు పాల్పడ్డారన్నారు. కాంగ్రెస్ శాంతి మార్గాన్ని వీడదని అంటువంటి పార్టీపై దాడి చేసి అనేక మంది నాయకులు కాల్లు, చేతులు విరగకొట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. పైగా తప్పుడు కేసులు పెట్టి వేదించడాన్ని ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోలు శివ, బండారి ప్రసాద్,మాచిడి సత్యనారాయణ,గుండా రాజు,దొరగోర్ల శ్రీనివాస్, బాస అశోక్ యాదవ్, బీముని లింగయ్య గౌడ్ లు పాల్గొన్నారు.

Tags:Central and state governments that do not tolerate peaceful protests
