Natyam ad

రియల్ ఎస్టేట్ పై కేంద్ర, రాష్ట్రాల లోల్లి

హైదరాబాద్ ముచ్చట్లు:


రాష్ట్రంలోని రియల్ వ్యాపారంలో పెట్టుబడిదారుల పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ, ఈడీ, సీబీఐ, సిట్ దాడులతో కొనుగోలుదారులు వణికిపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ పోరు ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపైన తీవ్రంగా పడుతున్నది. ఇది ఎప్పుడు ముగుస్తుందో? ఎక్కడికి దారి తీస్తుందో? ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. వచ్చే ఏడాది కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు పలికే కంపెనీలకు మరింత కష్టకాలమేనన్న అభిప్రాయమైతే సర్వత్రా వినిపిస్తున్నది. అప్పుడు ఈ ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొన్న వారి పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం జోరుగా నిర్మాణాలు జరుగుతున్న అరబిందో ప్రాజెక్టుల్లో కొనుగోలు చేయడానికి బయ్యర్స్ చెల్లించిన సొమ్ముపైనా ఐటీ దృష్టి సారిస్తే ఎట్లా? అరబిందో రియాల్టీ సంస్థ ఖాతాకు డబ్బులు ఎవరెవరి నుంచి వచ్చాయి? అందులో ట్యాక్స్ కట్టిందెంత? నల్లధనమెంత? అనే కోణంలో ఐటీ, ఈడీలు దృష్టి సారిస్తే తమ భవిష్యత్తు ఏమిటి? వంటి అంశాలు కొనుగోలుదారులను టెన్షన్ పెడుతున్నాయి.ఇప్పటికే ఫీనిక్స్, అరబిందో వంటి ప్రముఖ సంస్థలపై దాడులు జరిగాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో రియాల్టీ ఎండీ శరత్ చంద్రారెడ్డి అరెస్టు అయ్యారు. ఆ తర్వాత మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరి ఇండ్లల్లో పెద్ద ఎత్తున సోదాలు జరిగాయి. అంతకు ముందే పలు నిర్మాణ రంగ సంస్థలపైనా ఐటీ సోదాలు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల ప్రభావం రియల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.ప్రముఖ కంపెనీలన్నీ ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డాయి. నల్లధనాన్ని దారి మళ్లించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. దర్యాప్తు సంస్థల విచారణలో పారిశ్రామికవేత్తలు,

 

 

 

 

కంపెనీల ఖాతాల్లోని లెక్కలు, లభించిన నగదు లెక్కల్లో తమ పేర్లు ఎక్కడ బయట పడతాయోనని విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసినవారు ఆందోళనకు గురవుతున్నారు. ఎలాగూ ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ విలువకంటే పదింతల సొమ్ము కంపెనీలకు ముట్టజెప్పారు. ఈ క్రమంలో ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలంటూ తమకెక్కడ నోటీసులు వస్తాయేమోనని భయపడుతున్నారని సమాచారం. అందుకే ప్రీ లాంచ్ కింద విల్లాలు కొనుగోలు చేసినవారు డబ్బులు వాపస్ చేయాలంటూ ప్రముఖ కంపెనీలను ఒత్తిడి చేస్తున్నారు. ప్రధానంగా అరబిందో రియాల్టీ సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల్లోనూ తీవ్ర ప్రభావం పడిందని మార్కెట్‌లో చర్చ నడుస్తున్నది. అదేవిధంగా మిగతా ఐటీ, ఈడీ దాడుల్లో చిక్కుకున్న కంపెనీ బయ్యర్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దర్యాప్తు సంస్థలు వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడం ద్వారా అనుకున్న గడువులోగా వారు చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి కావడం అసాధ్యమనే మాట వినిపిస్తున్నది. ప్రీ లాంచ్ కింద 100 శాతం, 50 శాతం చెల్లించిన బయ్యర్స్ ఆందోళన బాట పట్టారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని వారూ యత్నిస్తున్నట్లు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెప్తున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డి అరెస్టు కావడంతో సంస్థ షేరు విలువపైనా గణనీయంగా ప్రభావం పడినట్లు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే అరబిందో రియాల్టీ సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్నారనే విషయం చాలా మందికి తెలియదు. శరత్ రెడ్డిని ఈడీ అరెస్టు చేయడంతో అరబిందో రియాల్టీ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై సర్వత్రా చర్చ నడుస్తున్నది. ఫార్మా రంగం నుంచి ఉన్నట్టుండి రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఆ సంస్థ అడుగు పెట్టింది. తెర వెనుక చాలా పెద్దలు ఉన్నారన్న ప్రచారం కూడా లేకపోలేదు.

 

 

 

Post Midle

ఐతే సదరు కంపెనీ మాదాపూర్, కొండాపూర్లో భారీ ప్రాజెక్టులను చేపట్టింది. కోహినూర్, రీజెంట్, పెరల్ పేర్లతో పెద్ద ఎత్తున హైరైజ్ బిల్డింగ్స్ కడుతున్నది. సుమారు నాలుగు వేలకు పైగా ఫ్లాట్ల నిర్మాణం జరుగుతుంది. రాయదుర్గంలో మరో రెండు వాణిజ్య నిర్మాణాలు కూడా చేపట్టింది. గెలాక్సీ, ఆర్బిట్ మొత్తం 3.15 మిలియన్ చ.అ.ల మేరకు ఉన్నట్లు తెలిసింది. పలువురు సంపన్న వర్గాలు, ఐటీ ఉద్యోగులు, ఔత్సాహిక కొనుగోలుదారులు ఆయా ప్రాజెక్టుల్లో ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ఇప్పుడీ సంస్థ ఎండీని అరెస్టు చేయడంతో దాదాపు ఐదు ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టు సజావుగా సాగుతుందా? లేదా? ఐటీ, ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు అకౌంట్లను ఫ్రీజ్ చేస్తే ఎట్లా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.హైదరాబాద్ నిర్మాణ రంగంలో అరబిందో రియాల్టీ సంస్థ ప్రత్యేకతను చాటుకుంటున్నది. అంతర్జాతీయంగా పేరెన్నికగల అర్కిటెక్ట్ చాప్మాన్ అండ్ టేలర్ మాదాపూర్‌లోని కొహినూర్ ప్రాజెక్టుకు అర్కిటెక్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని సుమారు 12 ఎకరాల్లో 42 అంతస్తులతో నిర్మిస్తున్నది. కొండాపూర్‌లో 12.3 ఎకరాల్లో నిర్మిస్తున్న రీజెంట్ ప్రాజెక్టును 39 అంతస్తుల్లో కడుతున్నది. పెరల్ హై ఎండ్ ప్రాజెక్టును మాదాపూర్‌లోనే చేపడుతున్నది. ఈ మూడు ప్రాజెక్టుల్లో మొత్తం ఫ్లాట్ల సంఖ్య నాలుగు వేల వరకు ఉంటుంది. ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.4 వేల కోట్ల పైమాటేనని అంచనా! అయితే,

 

 

 

 

ఎవరూ ఊహించని రీతిలో అరబిందో రియాల్టీ ఎండీ శరత్ రెడ్డి అరెస్టు కావడంతో ఈ నిర్మాణాలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.శరత్ రెడ్డి సారథ్యంలోని అరబిందో రియాల్టీ సంస్థ రాయదుర్గంలో గెలాక్సీ అనే వాణిజ్య సముదాయాన్ని సుమారు 1. 9 మిలియన్ చదరపు అడుగుల్లో కడుతున్నది. ఆర్బిట్ అనే మరో ఐటీ సముదాయాన్ని సుమారు 1.25 మిలియన్ చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నది. మార్కెట్ నుంచి మద్ధతు లేకపోవడంతో సాఫ్ట్వేర్, వాణిజ్య స్థలానికి గిరాకీ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రెండింటి పరిస్థితి ఏంటన్నది కూడా వ్యాపారవర్గాల్లో చర్చ జరుగుతున్నది. యూరప్‌ను ఆర్థిక మాంద్యం తలకిందులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడి సాఫ్ట్వేర్ రంగంపైనా దాని ప్రభావం కనిపిస్తున్నది. పేరెన్నికగల ఐటీ సంస్థలే ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఐటీ, వాణిజ్య సముదాయాల నిర్మాణం జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో అరబిందో సంస్థ చేపట్టిన రెండు వాణిజ్య సముదాయాల్ని ఏయే సంస్థలు తీసుకుంటాయనే విషయంలో స్పష్టత లేదని రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి.

 

Tags: Central and State Lolli on Real Estate

Post Midle