Natyam ad

కాళేశ్వరం ప్రాజెక్టుపై సెంట్రల్ కన్ను

కరీంనగర్ ముచ్చట్లు:


కాళేశ్వరం ప్రాజెక్టుపై సెంట్రల్కన్నేసింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ఇన్వెస్టిమెంట్ క్లియరెన్స్ లేదని కేంద్రం పార్లమెంట్వేదికగా ప్రకటించింది. ఇటీవల గోదావరి వరదలకు ఈ ప్రాజెక్టులోని పంప్హౌస్‌లు మునిగిపోవడంతో పాటుగా గ్రావిటీ కెనాల్ లైనింగ్దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ముసుగులోనే కేంద్రం జల సంఘం డైరెక్టర్‌తో పాటుగా ఇంజినీర్లు కాళేశ్వరం పనులను పరిశీలించారు. ఇదే సందర్భంలో మూడో టీఎంసీ పనులపై వివరాలు తీసుకున్నారు. జల వనరుల శాఖ ఇంజినీర్లు కూడా మూడో టీఎంసీ పనులపై కొంత మేరకు వివరాలిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై కంప్ట్రోలర్‌‌ అండ్‌‌ ఆడిటర్‌‌ జనరల్‌ ‌(కాగ్) ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పరిశీలించింది. ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు చేసిన పనులు, అందుకు చేసిన ఖర్చు, ప్యాకేజీల వారీగా నిర్మాణానికి ఎంత వ్యయంతో అనుమతులిచ్చారు. తర్వాత వాటిని ఎంతకు పెంచారు, ముందుగా రెండు టీఎంసీలకు చేసిన డిజైన్లు, ఆ తర్వాత మూడు టీఎంసీకు పెంచిన వివరాలన్నింటిపైనా ఆరా తీసింది. కాగ్‌‌ డిప్యూటీ అకౌంటెంట్‌‌ జనరల్‌‌ (ఢిల్లీ) రాజ్‌‌వీర్‌‌సింగ్‌‌, డిప్యూటీ అకౌంటెంట్‌‌ జనరల్‌ ‌(హైదరాబాద్‌‌) రోహిత్‌‌ గుట్టేలు హైదరాబాద్‌‌ ఏజీ ఆఫీస్‌‌ అకౌంట్స్‌‌ అధికారులు సహా మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌‌ను పరిశీలించారు. వాటి నిర్మాణ వ్యయం, మోటార్లు, పంపులు, ఇతర హైడ్రో ఎలక్ట్రికల్‌‌ పరికరాల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను సేకరించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టుపై గతేడాది నుంచి కాగ్అడిట్చేపట్టింది. ఈ ఏడాది మార్చిలో ఇచ్చిన నివేదికల్లో కాళేశ్వరం ప్రాజెక్టులోని కొన్ని లోపాలపై రిపోర్ట్‌లో వెల్లడించింది.

 

 

 

వర్షాలు, వరదలతో గోదావరి ఉప్పొంగిన నేపథ్యంలో సీడబ్ల్యూసీ బృందం కూడా కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించింది. ఈ నేపథ్యంలోనే మూడో టీఎంసీ పనులపై వివరాలు తీసుకుంది. అంతకు ముంద కాగ్ బృందం కూడా కొంతమేరకు పనులు చూసి, కొన్ని వివరాలు తీసుకున్నారు. అయితే, తాజాగా కాగ్ నుంచి రాష్ట్ర జల వనరుల శాఖకు లేఖ రాసినట్లు అధికారులు చెప్పారు. దీనిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని వివరాలు అడిగినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు మొత్తంలో నిర్వాసితులకు పరిహారం, ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ ప్యాకేజీ కోసం ఆర్థిక సంవత్సరాల వారీగా చేసిన ఖర్చు, ఇంకా ఎంత మందికి పరిహారం ఇవ్వాల్సి ఉంది, ఇంకా ఎంత భూమి సేకరించాల్సి ఉందనే వివరాలు అడిగారు.ఇక అడిషనల్‌‌ టీఎంసీ కోసం చేసే ఖర్చు, ఆయా పనుల వివరాలు, 2 టీఎంసీలకు మించి అడిషనల్‌‌ టీఎంసీతో సమకూరే కాస్ట్‌‌ బెనిఫిట్‌‌ రేషియో, ప్రాజెక్టుకు వచ్చిన అనుమతులు, ప్రాణహిత–చేవెళ్ల నుంచి కాళేశ్వరంగా రీడిజైన్‌‌ చేయడానికి దారితీసిన పరిస్థితులు, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ప్రాణహిత డీపీఆర్‌‌ సీడబ్ల్యూసీకి సమర్పించారా? దానికి సీడబ్ల్యూసీలోని డైరెక్టరేట్ల నుంచి క్లియరెన్స్‌‌ వచ్చిందా? ఇతర శాఖల అనుమతులు ఏమైనా వచ్చాయా? అనే వివరాలు ఇవ్వాలని కాగ్‌‌ కోరింది.కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై లోతుగా అధ్యయనం చేస్తోన్న ‘కాగ్‌’ సంబంధిత ఇంజినీర్ల నుంచి ఈ సమగ్ర సమాచారం కోరిందని తెలుస్తోంది. అదనపు టీఎంసీ పనులకు సంబంధించినవే ఎక్కువ సందేహాలు లేవనెత్తుతోంది. ముందుగా ఇంజినీర్లు కొంత మేరకు సమాధానాలను ఇచ్చినా..

 

 

 

Post Midle

అవి సమగ్రంగా లేకపోవడంతో మళ్లీ అదనపు సమాచారం అడగడం, ప్యాకేజీల వారీగా ఒప్పందాలు, ఆమోదించిన డిజైన్లు, తర్వాత జరిగిన మార్పులు, విద్యుత్తు ఖర్చు ఇలా అన్ని అంశాలను సమగ్రంగా కోరుతోంది. ఇప్పటివరకు అనేక ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టకపోవడం, అధిక మొత్తంలో రెవెన్యూ ఖర్చు, ఆర్థిక నిర్వహణ ఇలా అనేక అంశాలు కాగ్‌ పరిశీలనలో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.ఎల్లంపల్లి నుంచి అదనంగా 1.1 టీఎంసీల నీటిని మళ్లించేందుకు ఒక్కొక్కటి 3.6 మీటర్ల డయాతో పది వరుసల పైపుల నిర్మాణం చేపట్టారని, దీని ప్రకారం మొత్తం 36 మీటర్ల డయా అయినట్లు గుర్తించారు. అయితే మొదటి దశలో 1.9 టీఎంసీల నీటిని మళ్లించడానికి ఒక్కొక్కటి పది మీటర్ల డయాతో రెండు సొరంగమార్గాలు తవ్వారని, అదనపు టీఎంసీ పనిలో ఇంత ఎక్కువ డయా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరాలు ఇవ్వాలని కాగ్తాజాగా కోరింది. అదనపు టీఎంసీ పని ద్వారా మళ్లించే నీటిని.. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు కృష్ణా బేసిన్‌లోని పంటలకు సరఫరా చేయడానికి అని పేర్కొన్నారని, అయితే ఎంత ఆయకట్టుకు ఇచ్చేది వివరాలు ఇవ్వాలని సైతం నోటీసులో అడిగారు.హైదరాబాద్‌కు అదనంగా పది టీఎంసీల నీటిని ఇవ్వాలని పేర్కొన్నారని, అయితే కేశవాపూర్‌ రిజర్వాయర్‌ తర్వాత నీటినిల్వకు చేసిన ఏర్పాట్లు ఏంటో తెలపాలని, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో ఎన్ని ఫ్లోరైడ్‌ గ్రామాలకు నీటిని సరఫరా చేస్తారో కూడా వివరాలు అందజేయాలని కాగ్అడిగింది.

 

 

 

మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి మధ్య ఉన్న మూడు బ్యారేజీలకు సంబంధించి, విద్యుత్తు ఖర్చు, భూసేకరణ, పునరావాసం ఇలా అనేక అంశాల్లో కాగ్‌ వివరాలు తీసుకుంటోంది. కానీ, ఈ వివరాలు ఇవ్వాలా.. వద్దా అనే దానిపై సీఎం నుంచి ఆమోదం రాలేదు. ఆమోదం వచ్చిన తర్వాతే కాగ్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు చెప్తున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులపై ముందు నుంచీ వివాదాలు వస్తూనే ఉన్నాయి. మొదట్లోనే నేషనల్గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు పడింది. ఆ తర్వాత సుప్రీం కోర్టులో పిటిషన్దాఖలైంది. గత నెలలో ఈ పనులపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సీడబ్ల్యూసీ ఆమోదం పొందిన డిజైన్ మేరకే కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోలేకపోతున్న తెలంగాణ, ఎలాంటి అనుమతులు లేకుండా రూ.30 వేల కోట్లు అక్రమంగా ఖర్చు చేసి అదనపు టీఎంసీ పనులు చేస్తోందని, తద్వారా ఎందరినో నిర్వాసితులను చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి, పలువురు నిర్వాసితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్‌ను జస్టిస్ ఏఎం కన్వీల్కర్, జస్టిస్జేబీ పార్థీవాల బెంచ్ విచారిస్తోంది. అయితే, ఈ విచారణ సందర్భంగానే కాళేశ్వరం మూడో టీఎంసీ పనులపై సుప్రీంకోర్టు స్టేటస్‌ కో ఇచ్చింది. పర్యావరణ అనుమతులు, డీపీఆర్‌ లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తున్నారనే పిటిషన్‌పై మూడో టీఎంసీ పనులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా? ఉంటే కోర్టుకు సమర్పించాలని సూచించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఓవైపు సీడబ్ల్యూసీ, మరోవైపు కాగ్నుంచి పూర్తి వివరాల కోసం రాష్ట్ర ఇరిగేషన్శాఖకు లేఖ అందడం కొంత ఆందోళనకరంగా మారింది.

 

Tags: Central eye on Kaleshwaram project

Post Midle

Leave A Reply

Your email address will not be published.