Natyam ad

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన కేంద్ర బలగాలు

-తూప్రాన్ పేట్, కొయ్యలగూడెం రెండు చోట్ల మంత్రి వాహనం తనిఖీ

చౌటుప్పల్ ముచ్చట్లు:


తుప్రాన్ పేట సమీపంలో,చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వాహనాన్ని కేంద్ర బలగాలు(సిఆర్పీఎఫ్),రాష్ట్ర పోలీసులు రెండు చోట్ల తనిఖీ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నిబంధనల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ మండలం డి నాగారం వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని పరిశీలించారు. తనిఖీల్లో మంత్రి  పూర్తిస్థాయిలో వారికి సహకరించారు.

 

Post Midle

Tags: Central forces inspected the vehicle of Minister Vemula Prashanth Reddy

Post Midle