Natyam ad

వరి కొనుగోలు కేంద్రాల వద్ద కేంద్ర ప్రభుత్వం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి  

-ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించిన బిజెపి నాయకులు

మంథని ముచ్చట్లు:


వరి ధాన్యం కొనుగోలుకు కనీస మద్దతు ధర కన్నా 100 రూపాయలు అధికంగా ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కేంద్ర ప్రభుత్వ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మంథని ఆర్టీవో కార్యాలయంలో ఈ విషయాలపై డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. మంథని ఆర్డిఓ అందుబాటులో లేని కారణంగా ఆయనకు ఫోను ద్వారా బిజెపి పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్   మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం  సహాయ సహకారాలతో వరి కొనుగోలు నగదు చెల్లింపులు జరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం  ఫ్లెక్సీలు కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా   రేషన్ దుకాణాల వద్ద కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పై త్వరగా స్పందించవలసిందిగా ఆర్డీవోను వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వేల్పుల రాజు సీనియర్ నాయకులు బోగొజు శ్రీనివాస్, చిలువేరి సతీష్ కాసర్ల సూర్య పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Central government should set up flexi at paddy buying centers

Post Midle

Leave A Reply

Your email address will not be published.