జగన్ కు షాకిచ్చిన కేంద్ర సంస్థలు

Date:23/07/2019

విజయవాడ ముచ్చట్లు:

వైసీపీ అధినేత, ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థతి వచ్చిందని చెప్పక తప్పదు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్షలకు రమ్మంటే… ముందు బాకీలు చెల్లించండి అంటూ కేంద్ర ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థలు షాకివ్వడంతో నిజంగానే జగన్ కు ఇప్పుడు ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితేనని చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో కుదిరిన ఈ ఒప్పందాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం వస్తోందని, ఆ నష్టాలను ఇకపైనా భరించడానికి సిద్ధంగా లేమని చెబుతున్న జగన్ విద్యుత్ కొనుగోలు ఒప్పందా(పీపీఏ) లను పున:సమీక్షిస్తానంటూ బరిలోకి దిగారు.

 

 

 

 

అయితే ఈ చర్య ద్వారా ఏపీకి లాభం మాటేమో గానీ, దేశవ్యాప్తంగా పెద్ద ఇబ్బందే వస్తుందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మసలుకోవాలని ఇప్పటికే కేంద్రం జగన్ సర్కారుకు సూచించింది.అయినా కూడా వినకుండా పీపీఏల పున:సమీక్షకే మొగ్గు చూపారు. అంతేకాకుండా మరింత స్పీడు పెంచేసిన జగన్… ఏకంగా సోమవారం పీపీఏల పున:సమీక్ష కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం భేటీని కూడా నిర్వహించారు. ఈ భేటీకి కేబినెట్ సబ్ కమిటీకి చెందిన మంత్రులు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డిలతో పాటు ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం హాజరయ్యారు.

 

 

 

 

ఈ భేటీకి రమ్మంటూ కేంద్ర ప్రభుత్వ రంగంలోని విద్యుదుత్పత్తి సంస్థలు ఎన్టీపీసీ, ఎస్ఈసీఐలకు వర్తమానం పంపితే… ఆ రెండు సంస్థలు ఈ భేటీకి రాకపోగా జగన్ సర్కారుకు దిమ్మతిరిగే షాకిచ్చాయితాము ఈ సమావేశాలకు హాజరు కాబోమని తేల్చేసిన ఆ రెండు సంస్థలు… ఇప్పటిదాకా తమకు కట్టాల్సిన బకాయిలను క్లియర్ చేయాలంటూ ఏకంగా నోటీసులే జారీ చేశాయి. ఈ రెండు సంస్థలు జగన్ సర్కారుకు నోటీసులు జారీ చేసిన వైనాన్ని ఈజీగా తీసుకోవడానికి లేదు.

 

 

ఎందుకంటే… ఈ రెండు సంస్థలు ఇచ్చిన నోటీసులు వాటికవే ఇచ్చినవి కాదు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే ఇచ్చినవిగా పరిగణించక తప్పదు. అంటే… జగన్ రివ్వూలకు రమ్మంటే… ఆ సంస్థలు అప్పులు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశాయంటే… జగన్ తీరుపై కేంద్రం ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉందో ఇట్టే అర్థం కాక మానదు. మరి రివ్యూలకు రమ్మన్న ఆ సంస్థలు అప్పు కట్టాలంటూ పంపిన నోటీసులకు జగన్ ఏమంటారో చూడాలి

నిధులు ల్లేవు 

Tags: Central institutions that gave pics a shake

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *