నంద్యాల సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్న చాహత్ బాజ్ పేయ్

-నంద్యాల లో తొలి పోస్టింగ్

నంద్యాల ముచ్చట్లు:

 

నంద్యాల సబ్ కలెక్టర్ గా  చాహత్ బాజ్ పేయ్  బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాద్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. చాహత్ బాజ్ పేయ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ ఐఐటి నుంచి బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పట్టుబద్రురాలు. ఈమె 2019 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఏపి కేడర్ ఆథికారిణిగా ఉన్నారు. మహరాష్ట్ర లో పుట్టి పెరిగి సివిల్ సర్వీసెస్ లో 59 వ ర్యాంకు సాధించినారు. పశ్చిమ గోదావరి జిల్లాలో శిక్షణ ఐఏఎస్ గా ఉన్న చాహత్ బాజ్ పేయ్ కి నంద్యాల సబ్ కలెక్టర్ గా తొలి పోస్టింగ్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం వరకు 2018 సంవత్సర బ్యాచ్ కి చెందిన ఐఎఎస్ అధికారిణి కల్పన కుమారి నంద్యాల సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి పదోన్నతి పై విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) డిపార్టుమెంటు కు వెళ్లారు. ఆమె స్థానంలో ఇన్చార్జి ఆర్డీవో గా వెంకట నారాయణమ్మ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం మరోసారి నంద్యాల కు సబ్ కలెక్టర్ గా మహిళనే నియమించడం విశేషం. 1996 తర్వాత నంద్యాలలో సబ్ కలెక్టర్ గా కల్పనా కుమారి బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు కూడా ఐఏఎస్ అధికారిణి సబ్ కలెక్టర్  గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Chahat Bajpayee will be the Nandyal sub-collector

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *