ఛైన్ స్నాచింగ్ గ్యాంగ్ అరెస్టు
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు జిల్లాల్లో చైన్ స్నాచింగ్ చేస్తున్న ముఠా ను అరెస్టు చేశామని ఎస్పీ అరిఫ్ హాఫిజ్ వెల్లడించారు. నిందితులు రాత్రి వేళల్లో కరెంట్ లేని ప్రాంతాల్లో .స్పీడ్ బేకర్లు వద్ద స్నాచింగ్ ఎంచుకుంటున్నారు. స్నాచింగ్ చేస్తున్న నలుగురు నిందితుల తో పాటు దొంగ సొత్తు ను అమ్ముతున్న నిందితుడు మల్లేశ్వర రావు ను అరెస్ట్ చేశామని అయన అన్నారు.
నిందితులు వద్ద 39 కేసుల్లో 1243 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నాం. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం సొత్తు విలువ 68 లక్షలు ఉంటుంది.
నిందితుల వద్ద నుంచి దొంగ బంగారం కొనుగోలు చేసిన ఎవరి పైన అయినా చట్ట ప్రకారం చర్యలు తప్పవు. నిందితులు స్నాచింగ్ చేసిన తరువాత వెంటనే వారధి దాటి విజయవాడ కి పారిపోతున్నట్లు విచారణలో వెల్లడైందని అయన అన్నారు.
Tags: Chain snatching gang arrested

