మారేడుపల్లిలో ఛైన్ స్నాచింగ్
సికింద్రాబాద్ ముచ్చట్లు:
సికింద్రాబాద్ మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ జరిగింది. పల్సర్ పై వచ్చిన ఓ యువకుడు వెనక నుండి ఓ మహిళ మెడలో నుండి బంగారు పుస్తెలతాడు, నల్లపూసల గొలుసు లాక్కుని పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన బాధిత మహిళ అరచినప్పటికీఛైన్ స్నాచర్ పల్సర్ బైక్ నడిపి వేగంగా తప్పించుకున్నాడు.. మారేడు పల్లి పోలీసులకు బాధితురాలు విజయలక్ష్మి ఫిర్యాదు చేసింది. సంజీవయ్య నగర్ రైల్వే కాలనీ కి చెందిన విజయలక్ష్మి ఉదయం 10 గంటల ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తుండగా పల్సర్ పై వెనక నుండి వచ్చిన యువకుడు స్నాచింగ్ కు పాల్పడ్డాడు… బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. సిసి కెమెరాలును పరిశీలిస్తున్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Chain snatching in Maredupally