తిరుమలలో భక్తుల సౌకర్యాలను పరిశీలించిన టిటిడి ఛైర్మన్

Date;28/02/2020

తిరుమలలో భక్తుల సౌకర్యాలను పరిశీలించిన టిటిడి ఛైర్మన్

తిరుమలముచ్చట్లు:

తిరుమలలోని పలు ప్రాంతాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు  వైవి.సుబ్బారెడ్డి శుక్రవారం అదనపు ఈవో  ఎవి.ధర్మారెడ్డితో కలిసి పరిశీలించారు.
తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం వద్ద భక్తులతో కలిసి జలప్రసాదం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల నిషేధం వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదని భక్తులు చెబుతున్నారని, జలప్రసాదం నీటిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని
తెలిపారు. తిరుమలలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేసి స్వచ్ఛమైన జలప్రసాదం నీటిని అందిస్తున్నామని చెప్పారు. ఈ నీటి వినియోగంపై భక్తులకు అవగాహన  కల్పిస్తున్నామని, భక్తులు కూడా ఈ జలప్రసాదాన్ని పవిత్రంగా భావించి తాగుతున్నారని వివరించారు. ప్లాస్టిక్ బాటిళ్ల నిషేధంపై భక్తుల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. ముందుగా ఎటిసి నుండి ప్రారంభించి  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మీదుగా సుపథం వద్దకు చేరుకున్నారు. సుపథం మార్గం ద్వారా ఎవరెవరిని అనుమతిస్తారని అడిగి తెలుసుకున్నారు.
అక్కడినుండి ప్రధాన కల్యాణకట్టకు చేరుకుని క్షురకులు తలనీలాలు తీయడాన్ని, అక్కడి వసతులను పరిశీలించారు.  అనంతరం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద గల
దుకాణాలను పరిశీలించారు. అక్కడి నుండి అన్నప్రసాద భవనానికి చేరుకుని రుచి, శుచిపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ భక్తులతో కలిసి జలప్రసాదం స్వీకరించారు.
ఛైర్మన్ వెంట టిటిడి విఎస్వో మనోహర్, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో  హరీంద్రనాథ్, అన్నప్రసాదం డెప్యూటీ ఈవో  నాగరాజ, క్యాటరింగ్ అధికారి  జిఎల్ఎన్.శాస్త్రి, కల్యాణకట్ట డెప్యూటీ ఈవో   సెల్వం తదితరులు ఉన్నారు

 

Tags;Chairman of TTD who inspected the facilities of pilgrims at Tirumala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *