తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ- తుడా ఛైర్మన్‌ గా చైతన్య పేరు ఖరారు

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ- తుడా ఛైర్మన్‌ గా జనసేనా పార్టీ నాయకురాలు   చైతన్య పేరు దాదాపు ఖరారైంది. జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జ్‌గా, పార్టీ బలోపేతంతో పాటు కూటమి అభ్యర్థుల గెలుపునకు విశేషంగా కృషి చేసినందుకు గానూ జనసేనా పార్టీ అధినేత  పవన్‌ కళ్యాణ్‌  ఆశీర్వాదంతో   చైతన్య పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. కూటమి అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి తుడా ఛైర్మన్‌ పదవి కోసం పలువురు టీడీపీ నాయకులు పోటీలో ఉన్నారు. కానీ చిత్తూరు జిల్లాలోని సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని స్వయానా  ఆదికేశవులు నాయుడు  మనుమరాలైన చైతన్య వైపు జనసేన పార్టీతో పాటు కూటమి అగ్రనాయకులు మొగ్గుచూపుతున్నారు.  చైతన్య  అభ్యర్థిత్వాన్ని జనసేనా, టీడీపీ, బీజేపీ పూర్తిగా బలపరుస్తున్న కారణంగా రెండు, మూడు రోజుల్లో  చైతన్య పేరును తుడా ఛైర్మన్‌గా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు శాసనసభకు, చిత్తూరు పార్లమెంట్‌ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశాలున్నా… అధినాయకత్వం ఎంపికల్ని కాదనకుండా ఆయా చోట్ల నిలిపిన కూటమి అభ్యర్థుల గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన కూటమి నాయకులు  చైతన్య అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతున్నారు. పైగా ఈమె అదికేశవుల నాయుడు  కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకురాలు కావడంతో… ఈ పదవిని చైతన్యకు ఇవ్వడం ద్వారా వారి కుటుంబానికి సరైన గౌరవం కల్పించినట్లవుతుందని, ఆ ప్రాంతంలోని సామాజిక సమీకరణాల్ని సైతం తృప్తి పరిచినట్లవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ భావిస్తున్నారు.

 

Tags:Chaitanya has been named as the Chairman of Tirupati Urban Development Authority- TUDA.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *