తెలంగాణా విముక్తి కోసం పోరాడీన ధీర వనిత చాకలి ఐలమ్మ

– ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Date:26/09/2020

జగిత్యాల  ముచ్చట్లు:

రజాకార్లను ఎదిరించిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని మాజీ మంత్రి, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. శనివారం జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు వద్ద నెలకొల్పిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రారంభించగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడడమే కాకుండా తెలంగాణ విముక్తి కోసం ఆనాడు పాలకులను ఎదిరించాలని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ ను అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని అమే ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని జీవన్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కల్లెపెల్లి దుర్గయ్య, నక్క జీవన్, నాయకులు గాజుల రాజేందర్, రేపల్లె హరికృష్ణ, అల్లాల రమేష్ రావు, పులి రాము, పెద్దింటీ రాజం, నక్క గోపాల్, లింగం, గుండారపు రవి, గిరిధర్, అనిల్, రంగు వేణుగోపాల్, మధు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ముంబైలో  బీహార్ ఎన్నికల వేడి

Tags:Chakali Ailamma, a brave woman who fought for the liberation of Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *